Technology: సెల్ఫోన్ పోయిందని దిగులు పడకండి.. ఈ యాప్ ఉపయోగిస్తే చాలా దొరికినట్టే?

Technology: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ ఫోన్ లు దర్శనమిస్తున్నాయి. ఇక పెద్దపెద్ద సిటీలలో అయితే కనీసం ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అలా మనిషి స్మార్ట్ ఫోన్ కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. రోజులో 24 గంటల్లో దాదాపు 16, 17 గంటలు మొబైల్ ఫోన్లోనే గడిపే వాళ్ళు ఉన్నారు. అటువంటి స్మార్ట్ ఫోన్ లను చాలామంది కొన్ని వేలు ఖర్చు చేసి మరి కొంటూ ఉంటారు. అటువంటి ఫోన్లు పోయినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. స్మార్ట్ ఫోన్లు పోయినప్పుడు ఆ ఫోన్లు ఎవరు తీసుకున్నారో తెలియక పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.

 

కొంతమంది వారి స్మార్ట్ ఫోన్లపై ఆశలు కూడా వదిలేసుకుంటూ ఉంటారు. అయితే ఇకపై అటువంటి అవసరం లేకుండా విశాఖ పోలీసులు ఒక యాప్ ని రూపొందించారు. ఆ యాప్ లో హాయ్ అంటే చాలు మీ దగ్గర నుంచి పోయిన ఫోన్ అని వెతికి తెచ్చి మరి మీకు తెలుసా అప్పగిస్తున్నారు. నెల రోజుల్లోనే 100కు పైగా మొబైల్ ఫోన్లను ఈ విధంగా నీకు ఎవరు చేశారు. ఇందుకోసం మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ నెంబరు 9490617916 కు హాయ్ అని మెసేజ్ పంపితే చాలు.

 

ఆ మెసేజ్ పంపిన వెంటనే ఒక లింకు వస్తుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదులు చేసి అప్లికేషన్ అంతా నింపి జిరాక్స్ కాపీలు అంతా జోడించాల్సిన అవసరం లేదు. కేవలం మీకు వచ్చిన లింక్ క్లిక్ చేసినా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే చాట్ బోట్ పేరుతో వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో జిమెయిల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత అందులో మొబైల్ పోగొట్టుకున్న వారి వివరాలు మొబైల్ నెంబర్ తో పాటు ఐఎంఈఐ నెంబర్, ఏరియా పోలీస్ స్టేషన్, అడ్రస్ లాంటి కొన్ని వివరాలు పొందుపరిస్తే చాలు. మీ ఫోన్ ఎక్కడ ఉన్నా ట్రాక్ అయిపోతూ ఉంటుంది. అందుకోసం ప్రత్యేక టీం ఒకటి పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా విశాఖ పోలీసుకు గడిచిన నెలలో ఏకంగా 1400 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులలో ఇప్పటివరకు దాదాపు 100కు పైన ఫోన్లను రికవరీ చేయగలిగారు. అయితే మొబైల్ పోయింది అని బాధపడే వరకు ఇది నిజంగా ఒక చక్కటిఅవకాశం అని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -