Thugs: థగ్స్ యాక్షన్ ఫిలిం మ్యూజిక్.. విడుదల ఎప్పుడంటే?

Thugs: ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ గురించి మన అందరికీ తెలిసిందే. బృందా గోపాల్ దర్శకత్వంలో తెరక్కుతున్న తాజా సినిమా థగ్స్. ఈ సినిమా హిందీతో పాటుపలు భాషల్లో కూడా తెరకెక్కబోతోంది. కాగా రా యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న థగ్స్ సినిమాని రియా షిబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ సినిమాను హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శిబు తమీన్స్ కుమార్తెనే ఈ రియా షిబు. శిబు తమీన్స్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్, విక్రమ్, డాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో బాబీ సింహ, ఆర్కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో హ్రిదు హరూన్ అనే యంగ్ హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. కాగా ఇప్పటికే హ్రిదు హరూన్ పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు సైతం అందుకున్నాడు హ్రిదు హరూన్. అమెజాన్ లో వచ్చిన క్రాష్ కోర్స్ సీరీస్ లో తన నటనతో అటు విమర్శకులను ఇటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. అలాగే త్వరలోనే విడుదల కానున్న హిందీ చిత్రం మంబైకర్ లో కూడా నటించాడు.

ఇకపోతే ఈ థగ్స్ చిత్రం మ్యూజిక్, ప్రోమో కంటెంట్ ను తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మార్కెటింగ్ చేయడానికి సోనీ మ్యూజిక్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల విడుదలైన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసి అందరి ప్రశంసలు అందుకోవడంతో పాటు,చిత్రం పై అంచనాలను పెంచేసింది. శామ్ సి ఎస్ సంగీతం, బిజిఎం అందిస్తున్నారు. టాప్ ఎడిటర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ప్రవీణ్ ఆంటోనీ ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రోమో ఎడిటర్ గా బాగా పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రీయేష్ గురుస్వామి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

కాగా ఈ థగ్స్ సినిమా తెలుగు తెలుగు భాషతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈ ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదల కానుంది.

నటీనటులు:
హ్రిదు హరూన్, సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్, శరత్ అప్పని తదితరులు కీలకపాత్రలో నటించారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకత్వం బృంద నిర్మాణం హెచ్ ఆర్ పిక్చర్స్ – రియా శిబు
సంగీతం – శామ్ సి ఎస్
డీ వో పి – ప్రీయేష్ గురుస్వామి
ప్రాజెక్ట్ డిజైనర్ – జోసెఫ్ నెళ్లికల్
ఎడిటర్ – ప్రవీణ్ ఆంటోనీ
యాక్షన్ – ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ముత్తు కురుప్పయ్య
కాస్ట్యూమ్స్ – మాలిని కార్తికేయన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యువరాజ్
కో డైరెక్టర్ – హరిహరకృష్ణన్ రామలింగం
డిజైనర్ – కబిలన్
పి ఆర్ ఓ – బి ఏ రాజు’స్ టీం (తెలుగు)

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -