Doctor Noori Pari: మద్యం కొనుక్కునే వాళ్లు అన్నం కొనలేరా.. 10 రూపాయల డాక్టర్ సంచలన వ్యాఖ్యలు!

Doctor Noori Pari:  పది రూపాయల డాక్టర్ గా ఎంతో ఫేమస్ అయినటువంటి నూరి పరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో చేసే పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున సంచలనంగా మారారు. ఇక ఈమె కడప జిల్లాకు చెందినటువంటి డాక్టర్ కావటం విశేషం పది రూపాయలకే ఉచితంగా వైద్యం అందిస్తూ ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండగా మద్యపానం గురించి డాక్టర్ నూరి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం కొనుగోలు చేస్తూ చాలామంది తమ కుటుంబ సభ్యులను కూడా బజారున పడేస్తున్నారు కుటుంబ సభ్యులు కనీసం తినడానికి తిండి కూడా లేకపోయినప్పటికీ వీరీకి మాత్రం తాగడానికి డబ్బులు బాగానే వస్తున్నాయి అని ఉద్దేశంలో ఈమె మాట్లాడారు.

పరిమితికి మించి తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరం అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఒక వ్యక్తి పరిమితికి మించి మందు కొనుగోలు చేసే తాగటం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి అందుకే ఒక వ్యక్తి మందుకొనేటప్పుడు కచ్చితంగా ఆధార్ తీసుకొని అనుసంధానం చేయడం వల్ల ఆ వ్యక్తి ఎంత తీసుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది. తద్వారా పరిమితికి మించితే తనకు రావలసిన సబ్సిడీలు కట్ చేయాల్సి ఉంటుందని ఈమె తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇలా చేసినప్పుడే మద్యం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తారని ఈమె తెలియజేశారు. ఇక మద్యం కొనుగోలు చేసినోడు భోజనం కొనుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కానీ భోజనానికి ఇవ్వని ప్రాధాన్యత మద్యానికి ఇస్తున్నారు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. ఒక డాక్టర్ గా మద్యం ఎక్కువగా తాగకూడదన్న ఉద్దేశంతో డాక్టర్ నూరి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -