YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా ముందున్నాయి. తేదేపా మేనిఫెస్టో విడుదలవ్వడంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు పూర్తిస్థాయిలో కూటమి వెనుక తిరిగి పోయారన్న రిపోర్ట్ వైసీపీకి అందడంతో వారిలో ఈ గుబులు మొదలైంది.

మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి చాలా విషయాల్లో కూటమి హామీలు వైసీపీ హామీల కంటే ఉన్నతంగా ఉన్నాయి. పెన్షన్ల విషయమై 4000 నుంచి 60 వేల వరకు మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన కూటమి పెట్టడాన్ని వైసీపీ జీర్ణించుకోలేక పోతుంది. దాంతో లేనిపోని భయాన్ని పెంచుకున్న వైసీపీ తెదేపా మేనిఫెస్టో పై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టిన తర్వాత కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో అలాగే నరేంద్ర మోడీ ఫోటో కూడా ఉండాలి కదా అంటూ ప్రశ్నిస్తుంది.

నిజానికి బీజేపీ జాతీయ పార్టీ, కూటమి మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ ఫోటో ఉంటే దేశవ్యాప్తంగా అలాంటి మేనిఫెస్టో అమలు చేయాలని ఇతర రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంది. అందుకే ఫోటో పెట్టలేదు తప్పించి బీజేపీ కావాలి అనుకుంటే కచ్చితంగా మేనిఫెస్టో మీద ప్రధాని ఫోటో ఉంటుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర నామ మాత్రమే అని అందరికీ తెలుసు.

పేరుకి ఆరు లోక్ సభ స్థానాలు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఎన్ని సీట్లలో తమ ప్రభావం ఉంటుందన్నది ఆ పార్టీకి పూర్తిగా తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే జనసేన రాష్ట్ర పార్టీయే అయినప్పటికీ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలకే పరిమితమైన జనసేన పార్టీ ఈ విషయంలో తెదేపా తో ఏకాభిప్రాయంతో ఉంది. నిజానికి ఇవి వైసీపీ అభ్యంతరాలు అనటం కన్నా వైసీపీ భయాలు అనటం సబబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -