YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం ఏమిటంటే గవర్నమెంట్ ఉద్యోగులందరికీ మే ఒకటో తారీఖున జీతం పడినట్లు బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చాయి. ప్రతినెల 5, 6 తారీకు వరకు కొందరికి మరికొందరికి 11, 12 తారీకుల వరకు జీతాలు పడేవి కాదు.

అలాంటిది ఒకటో తారీఖున శాలరీ పడటం చూసి ముందు ఖంగు తిన్న ఉద్యోగులు తర్వాత అసలు విషయం తెలుసుకొని ఇదంతా జగన్ మాయ అని నవ్వుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులని అనేక రకాలుగా వేధించిన జగన్ ప్రభుత్వం పోలింగ్ దగ్గర పడేసరికి వారిపై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుంది. దీనికి కారణం ఉద్యోగస్తులు జగన్ ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉండటమే.

గత ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు పిఅర్సీ పనులు, సీపీఎస్ రద్దు వంటి సీరియస్ అంశాలతో పాటు జీతాల కోసం కూడా పోరాడవలసి వచ్చేది. జగన్ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వానికి అప్పు దొరికితేనే తమకు జీతాలు ఇస్తుంది అని నమ్మకం ఉద్యోగస్తులలో బాగా స్థిరపడిపోయింది ఈ విషయం సామాజిక మాధ్యమాలలో కూడా చర్చనీయాంసమైంది. అయితే ఉద్యోగస్తులని బుట్టలో వేసుకుని ప్రయత్నమో, వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నమో,ఎన్నికలు దగ్గర పడుతున్న భయమో తెలియదు.

కానీ ఈనెల ఒకటో తారీకున అందరికీ జీతాలు వేసి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి బకాయిల గురించి ఎంతగా పోరాడుతున్నా కనీసం పట్టించుకోని ప్రభుత్వం నాలుగైదు రోజుల క్రితం హఠాత్తుగా కొన్ని విభాగాల ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలని కూడా చెల్లించింది. ఒక్కొక్కరి ఖాతాలో 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వేసింది. ఈ తాయిలానికి ఉద్యోగస్తులు పడతారా అంటే ఈసారి మళ్లీ నమ్మి మోసపోం అనే సమాధానమే వినిపిస్తోంది వారి దగ్గర నుంచి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -