Noori Parveen: రూ.10కే వైద్య సేవలు అందిస్తున్న కడప డాక్టర్.. ఈమె మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

Noori Parveen: ప్రస్తుత రోజుల్లో చిన్న జ్వరం వచ్చింది హెల్త్ బాగాలేదు అని హాస్పిటల్ కి వెళ్ళాలి అంటేనే సామాన్యులు భయపడుతున్నారు. అందుకు గల కారణం హాస్పిటల్ బిల్లు. హాస్పటల్లో వైద్యులు ఉన్నవి లేనివి చెప్పి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక కండిషన్ కాస్త పెద్దది అయితే ఏకంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులు మధ్యతరగతి కుటుంబం వారు హాస్పిటల్ కి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు. అలాంటిది కేవలం పది రూపాయలకే చికిత్స అందించడం అంటే మామూలు విషయం కాదు అని చెప్పవచ్చు. చాలామంది పది రూపాయలకే వైద్యం అంటే ఏంటి జోక్ చేస్తున్నావా అని అంటూ ఉంటారు. కానీ ఇది నిజం.

కడపలో ఒక డాక్టర్ కేవలం పది రూపాయలకే వైద్య సేవలు అందిస్తూ గొప్ప మనసును చాటుకుంటుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన యువ వైద్యురాలు నూరీ పర్వీన్ పది రూపాయలకే వైద్యం అందిస్తోంది. కడపలో మెడిసిన్ చదివిన నూరి పర్వీన్ స్వస్థలం విజయవాడ అయినా కడపలోనే వైద్య సేవలు అందిస్తుండటం గమనార్హం. డాక్టర్ గా తక్కువ ధరకే వైద్య సేవలు అందిస్తూ నూరి పర్వీన్ ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. భవిష్యత్తులో పెద్ద ఆస్పత్రిని నిర్మించి ఆ ఆస్పత్రి ద్వారా కూడా 10 రూపాయలకే వైద్య సేవలను అందిస్తానని తెలిపింది. ఒకవైపు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలలో ఆమె పాల్గొంటున్నారు. ప్రస్తుత కాలంలో వైద్యం ఖరీదైనది కావడంతో నూరి పర్వీన్ తక్కువ ధరకే వైద్యం చేయడం ద్వారా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.

లక్షల రూపాయల ఫీజులు చెల్లించలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతుండటంతో వాళ్లకు అండగ నిలుస్తున్నానని నూరి పర్వీన్ కామెంట్లు చేశారు. గతంలో కొంతమంది ఒక్క రూపాయికే వైద్య సేవలు అందించారని ఆమె చెబుతున్నారు. 10 రూపాయల ఫీజు అంటే ఎవరూ భారంగా ఫీల్ కారని నూరి పర్వీన్ పేర్కొన్నారు. నూర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని ఆమె వెల్లడించారు. అలాగే ప్రజలకు సేవ చేయడం ద్వారా చరిత్రలో నిలిచిపోవాలని తన కోరిక అని నూరి పర్వీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -