Delhi: ఢిల్లీలో దారుణం.. ప్రాణం తీసిన రూ.500 నోటు గొడవ

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. రూ.500 నోటు విషయంలో జరిగిన గొడవ చివరికి ప్రాణాలు తీసింది. నలుగురు మైనర్లు ఈ హత్యలు చేయడం, తాము డాన్ లుగా ఎదగడానికి హత్య చేసినట్లు నలుగురు మైనర్లు చెప్పడం పోలీసుల మతి పొగొట్టింది. వారి సమాధానానికి ఢిల్లీ పోలీసులకు దిమ్మతిరిగిపోయింది.

భజనపురాలోని సుభాష్ మొహల్లా ఏరియాకు చెందిణ షాపు ఓనర్ షానవాజ్ గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఆయనపై కత్తితో దాడి చేశారు. స్థానికులు గుర్తించి హాస్పిటల్ లకు తీసుకెళ్లేలోపు చనిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. నలుగురు మైనర్లు బైక్ పై వచ్చి హత్య చేసిట్లు పోలీసుల గుర్తించారు.

20 రోజుల క్రిందట షాపులో తాము కొన్ని వస్తువులు కొన్నామని, తామిచ్చిన రూ.500 నోటు చెల్లదని షాపు ఓనర్ చెప్పడంతో గొడవ జరిగిందని నిందితులు చెప్పారు. గొడవ జరిగిన సమయంలో షాపు ఓనర్ షానవాజ్ ను బెదిరించి వెళ్లిపోయారు. అతనిపై కోపంతో గురువారం షాప దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి చంపేశారు. నిందితుల దగ్గర నుంచి కత్తిని పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.

ఆ షాపు ఓనర్ కు భయం చెప్పి స్థానికుల్లో భయం పుట్టించాలని అనుకున్నాని మైనర్లు చెప్పారు. డాన్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా హత్య చేశామని మైనర్లు ఒప్పుకోవడం చూసి పోలీస్ అధికారుల అవాక్కయ్యారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తామే నేరం చేశామని మైనర్లు ఒప్పుకోవడం, కావాలనే చేశామని అంగీకరించడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రౌడీలుగా ప్రజల్లో భయం కలిగించాలని అనుకన్నామంటూ నలుగురు మైనర్లు పోలీసుల విచారణలో స్పష్టం చేసినట్లు పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని అంటున్నారు. చిన్న వయస్సులో ఇలాంటి ఆలోచనలు రావడం దుర్గార్మమని పోలీసుల అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -