Pan Card: పాన్ కార్డ్ పేరు చిరునామా తప్పుగా ఉన్నాయా.. వెంటనే ఇలా చేయండి!

Pan Card:  ప్రస్తుత కాలంలో మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. 50 వేల రూపాయలకు మించి బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరగాలంటే తప్పనిసరిగా పాన్ కార్డు ఉపయోగపడుతుంది.ఇలా ఆర్థిక లావాదేవీల విషయంలో ఎంతో కీలకంగా మారినటువంటి పాన్ కార్డు విషయంలో ప్రతి ఒక్కటి ఎంతో సక్రమంగా ఉంటేనే భవిష్యత్తులో మనకు ఆర్థిక లావాదేవీల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

సాధారణంగా కొన్నిసార్లు అనుకొని పొరపాటు వల్ల మన పాన్ కార్డులో మన పేరు చిరునామా లేదా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.ఇలాంటి పొరపాట్లు ఉన్నప్పుడు వెంటనే వాటిని సరిచేసుకోవాలి లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. మన పాన్ కార్డులో ఏదైనా తప్పు కనపడితే వాటిని ఎలా సరిచేసుకోవాలి అనే విషయానికి వస్తే…

మన పాన్ కార్డులో ఏదైనా తప్పు ఉన్న లేకపోతే ఏదైనా సమస్య ఉన్న వెంటనే మనం ఆదాయపు పన్ను శాఖ అధికారులను సంప్రదించాలి. ఇలా కాని పక్షంలో NSDL ని సంప్రదించాలి. లేదంటే ఆదాయపు పన్ను శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి మన సమస్యను వివరించి పరిష్కారం తెలుసుకోవచ్చు లేకపోతే మెయిల్ ద్వారా కూడా మన సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే మనం NSDLకి ఎస్ఎంఎస్ రూపంలో మన సమస్యను పంపించవచ్చు.

ఈ విధంగా NSDLPAN రసీదు సంఖ్యను 57575 కి ఎస్ఎంఎస్ చేయడం ద్వారా వెంటనే మనం మన సమస్యను పరిష్కరించుకోవచ్చు.ఇలా పాన్ కార్డులో సమస్య ఉన్నవారు ఈ విధంగా తమ సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలలో సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. ఇలాంటి ముఖ్యమైన గుర్తింపు కార్డుల విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న భారీ నష్టం ఎదుర్కోవలసి వస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -