S. P. Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు ఘోరమైన అవమానం.. ఇదంతా వైసీపీ కుట్రనేనా?

S. P. Balasubrahmanyam: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతను ఒక అగ్రస్థాయి గాయకుడు.. ఇతను ఇండస్ట్రీలో నటుడుగా, గాయకుడుగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడి.. సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆయన. ఈయన ఈ లోకాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన కూడా ఇప్పటికీ అందరి హృదయాలలో ఉన్నారు.

ఇక అలాంటి మహానీయుడు 2020 సెప్టెంబర్ 25న కొన్ని అనారోగ్యాల కారణంగా మరణించాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కు తీవ్రమైన అవమానం ఎదురైంది. గుంటూరు లక్ష్మీపురం సెంటర్ లోని మదర్ థెరిస్సా విగ్రహం దగ్గర కళాధర్భర్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ గత రాత్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని మునిసిపల్ సిబ్బంది పడగొట్టారు.

గుంటూరు నగరంలో రెండు వందల విగ్రహాలకు అనుమతి లేదు అని, వాటికి లేని అభ్యంతరం బాలసుబ్రమణ్యం విగ్రహానికి వచ్చిందా అంటూ.. చాలామంది కళాకారులు మండిపడుతున్నారు. ప్రజా సంఘాలు, కళాకారులు తమ వద్దకు రాకుండా దూరం పెడుతున్నారనే భావనతో.. వైసీపీ నేతలు కావాలనే ఇలా చేస్తున్నారని గుంటూరు నగరంలో కొందరు కళాకారులు అనుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ స్థానికంగా ఈ విషయం గురించి ఎన్నో చర్చలు నడుస్తున్నాయి.

వైసీపీ ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలు చేస్తుందని ఇక్కడ స్థానికులు కొందరు మండిపడుతున్నారు. ఏదేమైనా బాలసుబ్రమణ్యం విగ్రహాన్ని తొలగించడంలో మాత్రం కొంతవరకు అన్యాయం ఉందని కొందరు వార్తలు గుప్పిస్తున్నారు. మరి ఈ విషయం గురించి కళాకారులు ఇంకే విధంగా విమర్శలు చేస్తారో తెలియాలి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఓ వెలుగు వెలిగిన బాలసుబ్రమణ్యం హఠాత్తుగా అనారోగ్య కారణంగా మరణించారు. దాంతో సినీ ప్రపంచం అప్పట్లో మూగబోయింది. ఇటువంటి గాయకుడు ఇక రాడు అని కూడా కొందరు సినీ ప్రముఖులు.. సభముఖంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ను చాలా సార్లు తలుచుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -