Haircut: మంగళ, శుక్రవారాల్లో హేర్‌కట్‌ చేయరాదట..నిజమేమిటంటే!

Haircut: భారతదేశంలో ఆచారాలు, నియమాలు కచ్చితంగా పాటిస్తుంటారు. ఈ రోజుల్లో వివాహం చేయరాదు.. ఇళ్లు నిర్మించరాదు, ఇటువైపు బాత్రూమ్‌ పెట్టరాదు ఇలాంటివి పాటిస్తుంటారు. చాలా మంది శాస్త్రలను ఎక్కువగా నమ్ముతారు. అందులో ఒకటి మంగళ శుక్రవారం కటింగ్‌ చేసుకోరాదని పెద్దలు చెబుతుంటారు ఎక్కడ చూసినా మంగళవారం సెలూన్లు మూసివేయబడతాయి.

ఇంతకి మంగళ, శుక్రవారాల్లో క్షవరాలు ఎందుకు చేసుకోకూడదో చాలా మందికి తెలిదు. అయితే.. మంగళ, శుక్రవారాలు క్షుర కర్మ కు పనికి రావు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజులు వదిలేసి సోమ, బుధ వారాలు మాత్రమే చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. మరికొంత మంది శనివారం కూడా కటింగ్‌ చేసుకోవచ్చని సూచిస్తున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం.. కుజుడు మంగళ వారానికి, ఆయుధాలకు అధిపతి. కాబట్టి మంగళవారం సెలూన్‌కు సెలవని అంటారు.

అయితే జ్యోతిష్యుల ప్రకారం శస్త్ర చికిత్సకు మంగళవారం మంచిరోజట. అనుమతింపబడని రోజులలో క్షవరం చేసుకోవడంతో ఆయుష్షు తగ్గిపోతోందని చెబుతుంటారు. వారంతో పాటుగా నక్షత్రాలు కూడా చూసుకుని హెయిర్ కట్ చేయించుకోవాలి. ఆ తర్వాత తిథులు, పండుగలు, అమావాస్యలూ, ఆబ్దీకాలు అన్ని చూసుకుని చేయించుకోవాలట. పూర్వం రాజులు మంగళవారం, శుక్రవారం పూజలు హోమాలు నిర్వహిస్తారు కాబట్టి ఆ రెండు రోజులు కటింగ్‌ షాపునకు సెలవు ప్రకటించి మిగిలిన రోజుల్లో చేయించుకునే వారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -