Babloo Prithviraj Second Marriage: విషపు సమాజం.. అసూయపు మనుషులు అంటూ పృథ్వీరాజ్ రెండో పెళ్లిపై నటి కామెంట్స్?

Babloo Prithviraj Second Marriage: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారు, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. ఇలా ప్రేమలో పడినంత తొందరగానే వీరి బ్రేకప్ కూడా ఉంటుంది. మరి కొంతమంది అయితే పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడాకులు తీసుకొని మరో పెళ్లికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇందుకు కాస్త భిన్నం అని చెప్పాలి. అక్కడ హీరో హీరోయిన్లకు మనసుకు నచ్చితే చాలు వారికి వయసుతో పనిలేదు.

ఈ విధంగా హీరోయిన్లు వయసులో తమ కన్నా చిన్నవాళ్లతో డేటింగ్ లో ఉండి ప్రేమ వివాహాలు చేసుకుంటే, హీరోలు సైతం ఆంటీలతో ప్రేమలో పడుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉంది అయితే ఇప్పుడు ఈ కల్చర్ కోలీవుడ్ మీడియాకి కూడా సోకిందని తెలుస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పృథ్వీరాజ్ గురించి మనకు తెలిసిందే.ఈయన ఎన్నో సినిమాలలో హీరో గాను విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి సందడి చేశారు .

ఇకపోతే పృథ్వీరాజ్ గత 34 సంవత్సరాల క్రితం బీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. గత కొంతకాలం నుంచి పృథ్వీరాజ్ తన భార్యకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈయన మలేషియాకు చెందిన 23 సంవత్సరాల యువతిని వివాహం చేసుకున్నట్టు సమాచారం. వయసులో తనకన్నా 34 సంవత్సరాల చిన్న వయసు అమ్మాయిని వివాహం చేసుకున్నారంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ విషయంపై స్పందిస్తూ లేటు వయసులో ఇలా పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ కాజల్ పృథ్వీరాజ్ రెండవ పెళ్లి గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ.. అతనికి ఆ కెపాసిటీ ఉంది.. అందుకే పెళ్లి చేసుకున్నారు. ఇందులో మీకు వచ్చిన సమస్య ఏంటి విషపు సమాజం అసూయపు మనుషులు అంటూ పృథ్వీరాజ్ కి సపోర్ట్ చేస్తూ ఈమె చేస్తున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -