Thamara Mala: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలా? ఈ మాల ధరించి చూడండి

Thamara Mala: జీవితం సుఖమయంగా గడవాలంటే అందరికీ డబ్బు అవసరం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు విపరీతంగా వచ్చి చేరుతుంది. అన్నింటినీ డబ్బుతో కొనలేక పోయినా, చాలా వరకు డబ్బుతో జీవితం ముడిపడి ఉంటుంది. డబ్బు లేనిదే నిత్య జీవితం సాఫీగా గడవడం కష్టం. మరి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉండాలంటే ఏం చేయాలి? ప్రత్యేకంగా పూజించాలా? అనే ప్రశ్నలకు అనేక సమాధానాలు ఉన్నాయి.

తామర మాలతో మంచి ఫలితాలు.. లక్ష్మీదేవి కరుణ పొందాలంటే అనేక మార్గాలు మన పూర్వీకులు సూచించారు. వీటిలో ఒకటి తారమ మాల. కమలాగట్ట మాల, లక్ష్మీదేవి అనుగ్రహ మాల అని కూడా పిలుస్తారు. వీటిని కలువలు అని కూడా అంటారు. లక్ష్మీదేవి తామర మాలకు పుత్రజీవి అని పేరుంది. తామర మాలను సంతానం లేని వారు నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ఉదయాన్నే తింటే మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చూర్ణం చేసుకొని కాస్త వేడి చేసిన ఆవు పాలతో కలిపి తాగాలి. ఇలా కొంత కాలం పాటు చేయడం వల్ల సంతానం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే తామర మాల ధరించిన వారిలో మనో నిగ్రహం, ఏకాగ్రత, సాత్విక గుణాలు అలవాటవుతాయి. తామర మాల ధరించడం వల్ల శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

స్పటిక మాల, పగడాల మాల కంటే మంచి ఫలితాలను తామర మాల ఇస్తుందని రత్న శాస్త్రంలో చెప్పారు. మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది శ్రద్ధా భక్తులతో లక్ష్మీదేవిని పూజించాలి. తమ చేతిలో ధనం అసలు నిలబడటం లేదని భావించే వారు తామర మాలతో జపం చేసినా, ధరించినా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్థిరాస్తులు పొందే అవకాశం లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -