Vangalapudi Anitha: వంగలపూడి అనితకు కాలం కలిసొస్తుందా.. ఆమె ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమేనా?

Vangalapudi Anitha: టీడీపీ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్నటువంటి మహిళ నేత వంగలపూడి అనిత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ నేతలు చేస్తున్నటువంటి అరాచకాలు మహిళలను కూడా చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ మానసిక వేదనకు గురి చేశారు. అయితే మానసిక వేధింపులను తట్టుకొని ధైర్యంగా నిలబడినటువంటి వంగలపూడి అనిత ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికలలో సత్తా చాటుపోతున్నారు.

ఈమె పాకాయరావు పేట నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. 2014వ సంవత్సరంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వంగలపూడి అనిత ఈసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 సంవత్సరంలో ఈమె కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాకాయరావు పేటలో ప్రజల పట్ల సానుకూలంగా ఉంటూ ఎక్కడ వ్యతిరేకత లేకుండా నియోజకవర్గంలో తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇక్కడ ఈమెకి ఎవరి సపోర్ట్ లేకపోయినా సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే సత్తా సంపాదించుకున్నారు. ఇక ఈమెకు పోటీగా ఈసారి వైసిపి పార్టీ నుంచి కంభాల జోగులు పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఈయన రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

గత ఎన్నికలలో పాకాయిరావుపేటలో గెలిచినటువంటి గొల్ల బాబురావును రాజ్యసభకు పంపించారు. అయితే రాజం సిట్టింగ్ ఎమ్మెల్యే పాకాయరావు పేటలో గెలవడంతో ఇక్కడ ఈయనకు సరైన పట్టు లేదని చెప్పాలి. ఇదే వంగలపూడి అనితకు ప్లస్ పాయింట్ గా మారింది. ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా వంగలపూడి అనితకే అక్కడి ప్రజలు పట్టం కడతారని తెలుస్తోంది. ఈమె ఈసారి భారీ మెజారిటీతో ఈ నియోజకవర్గ నుంచి గెలుపొందుతారని ఇప్పటికీ పలు సర్వేలు కూడా తెలిపాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -