Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే జగన్మోహన్ రెడ్డి సైతం తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వారందరూ కూడా ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా తమ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలలోకి తీసుకు వెళ్లకుండా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రతి సభలోనూ మాట్లాడుతూ వస్తున్నారు.

గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కేటీఆర్ హరీష్ రావు ఎలాగైతే ప్రజలలోకి తీసుకువెళ్లే ప్రచారాలను నిర్వహించారు అదే తప్పును ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నారు. ఆయన సిద్ధం సభలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలను నిర్వహించిన కూడా ఆ కార్యక్రమాలలో తన ఎన్నికల మేనిఫెస్టో గురించి చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ వస్తున్నారు.

ఇలా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పథకాల గురించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఈ పథకాల గురించి ప్రజలలో కూడా చర్చలు మొదలయ్యాయి. అమ్మబడి జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇవ్వగా చంద్రబాబునాయుడు ఎంతమంది ఉంటే అందరికీ ఇస్తానని తెలిపారు. ఇక పెన్షన్ కూడా జగన్ 3500 మాత్రమే చేశారు కానీ చంద్రబాబు మాత్రం 4000 చేసారు. ఇలా ఈ పథకాలన్ని కూడా జనాలలోకి వెళ్లిపోవడంతో తెలుగుదేశం పార్టీకి జగన్ మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా మారి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -