CM Jagan: జగన్ ను ముంచిన సలహాదారుడు అతనేనా.. వృద్ధాప్య పెన్షన్ విషయంలో ముంచింది ఎవరంటే?

CM Jagan: 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ. రెండు వేలు చేశారు. ఈ వృద్ధుల ఓటు బ్యాంక్ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటుందో తెలుసు కాబట్టి జగన్ పింఛన్ విషయంలో ఏకంగా తాను అధికారంలోకి వస్తే 3000 చేస్తానని మాయ మాటలు చెప్పారు.

అది నిజమేనని నమ్మిన వృద్ధులు అందరూ కూడా ఆయనకు ఓటు వేసి గెలిపించుకున్నారు. ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం పెన్షన్ ఫైలు పైనే పెట్టారు. అయితే ఈయన చెప్పినటువంటి మూడు వేలు ఒకేసారి కాకుండా ప్రతి ఏడాది 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతూ ఎన్నికలకు ముందు మూడు వేల రూపాయలను చేశారు.

ఇకపోతే ఈ ఎన్నికలకు ముందు విడుదల చేసే మేనిఫెస్టోలో కచ్చితంగా వృద్ధాప్య పెన్షన్ 4000 చేస్తారని అందరూ భావించారు కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తాను 3000 రూపాయలకు మించి పెన్షన్ ఇవ్వలేనని తెలియజేయడంతో దీనినే ఆసరాగా చేసుకున్నటువంటి బాబు ఏకంగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని హామీలు ఇచ్చారు.

ఇక వృద్ధాప్య పింఛన్ విషయంలో ఎవరిని మోసం చేయడానికి లేదు కులమత మంటూ భేదాలు చూపడానికి లేదు కనుక తమకు అత్యధిక పెన్షన్ రావడమే ముఖ్యమని ప్రతి ఒక్క వర్గానికి చెందిన వారందరూ కూడా భావించి నాలుగు వేలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక వైసిపి క్యాడర్ సైతం వృద్ధాప్య పెన్షన్ 4 వేలకు పెంచుతారని భావించారు కానీ జగన్ సలహాదారులు మాత్రం తనని ముంచారని తెలుస్తోంది. కేవలం సలహాదారుల వల్లే జగన్ ఈ నిర్ణయం తీసుకోలేదని మిగతా హామీల కన్నా.. ఇది చాలా పెద్ద మైనస్ అవుతుందని కంగారు పడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -