One Plus: అతి తక్కువ ధరకే వన్‌ప్లస్‌ నార్డ్‌ ఎస్‌–300 మొబైల్‌!

One Plus: పండుగలు వస్తున్నాయంటే వివిధ కంపెనీలు ఫోన్లను విడుదల చేస్తాయి. ఆయా కంపెనీలు పోటీపడి ఫీచర్లు, ధరను బట్టి విక్రయిస్తుంటారు. ఫోన్‌ కొనాలనుకునే ప్రతి ఒక్కరూ అందులో ఉండే ఫీచర్లను చూసి కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ వచ్చిందంటే లెటేస్ట్‌ వర్షన్‌తో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరను ఉంచి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఆధునిక ఫీచర్స్‌తో పాటు ఆకర్షణీయంగా ఉండే ఫోన్లను కొనేందకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు వన్‌ ప్లస్‌ సంస్థ యూఎస్‌ మార్కెట్‌ లో వన్‌ ప్లస్‌ నార్డ్‌ ఎస్‌ –3005జీ మోడల్‌ను మార్కెట్‌లోకి వదిలింది.

ఈ ఫోన్‌ కూడా చూడటానికి ఎంతో ఆకర్షణీయంతో పాటు మిడ్‌ నైట్‌ కేడ్‌ అనే ఒకే రంగులో లభిస్తుంది. 4జీబీ ర్యామ్‌ తో కూడిన ఈ ఫోన్‌ ధర 228 డాలర్లు. అనగా మన దేశ రూపాయాల్లో రూ.19వేలకు లభిస్తోంది. నవంబర్‌ 3 నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు మొదలు కానున్నాయి. ఇతర మార్కెట్లలోకి ఈ మోడల్‌ ను ఎప్పుడు విడుదల చేయాలనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 6.5 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌ సీడీ స్క్రీన్, మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ చిప్‌ సెట్‌ ఉంటుంది. మీడియాటెక్‌ ప్రాసెసర్‌ తో అమెరికాలో విడుదలైన మొట్ట మొదటి ఫోన్‌ ఇదే.

ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌ పై ఆక్సిజన్‌ ఓఎస్‌ సహాయంతో ఈ ఫోన్‌ పని చేస్తుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ తో పాటు 33 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ అడాప్టర్‌ కూడా ఫోన్‌ వెంబడే ఇస్తారు. నార్డ్‌ ఎస్‌– 300లో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సల్‌ కెమెరా ఉండగా బ్యాక్‌సైడ్‌ 48 మెగా పిక్సల్‌ కెమెరా, 2 మెగాపిక్సల్‌ డెప్త్‌ లెన్స్‌ తో డ్యుయల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. అంతేకాక పవర్‌ బటన్‌ వద్దే సింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ అమర్చడంతో వినియోగించడానికి కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంది. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే వినియోగదారుల నుంచి విశేష స్పందన వస్తోందని సదరు కంపెనీ సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -