AP Roads: ఏపీలో రోడ్ల పరిస్థితిని చూపించి ఓట్లు అడిగే దమ్ముందా.. వైసీపీ నేతల దగ్గర జవాబులున్నాయా?

AP Roads:  ఒక రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలి అంటే ముందుగా ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు కరెంట్ నీరు వంటి వాటివి సక్రమంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది అయితే ఏపీలో మాత్రం లేనిదే ఈ మౌలిక సదుపాయాలని చెప్పాలి ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తే ఎంతో దయనీయస్థితిలో ఉన్నాయి.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లను పట్టించుకున్న పాపానపోలేదు అయితే ఈయన మాత్రం రోడ్ల కోసమే ఏకంగా 43 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇలా 43 వేల కోట్ల రూపాయలతో రోడ్లు వేసినప్పటికీ అవి వర్షాలకు కొట్టుకుపోయాయి అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే తాను ఏమి చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు గొర్రెల లాగా నమ్ముతారు అన్న భావనలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.

43 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి రోడ్లు వర్షానికి ఎలా కొట్టుకుపోతాయి అని ప్రజలందరూ అయోమయంలో పడ్డారు. రోడ్ల పేరు మీద ఆ డబ్బులు అన్నింటిని ఎవరి ఖాతాలో వేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వాహనదారులు ఎన్నో ఇక్కట్లు పడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ గుంతల్లో పడి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇలా ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టలేదని చెప్పాలి. ఇక వాహనదారులు ఈ గుంతల రోడ్లలో ప్రయాణం చేస్తూ వాహనాల రిపేర్ల కోసమే వేలకు వేలు ఖర్చు చేసుకుంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతానికి వెళ్లిన ప్రతి ఒక్క రోడ్డు పరిస్థితి ఇంతే దయనీయస్థితిలో ఉందని చెప్పాలి. మరి రోడ్లు చూపిస్తూ వైసిపి అధికారులు వచ్చే ఎన్నికలలో ఓటు వేయమని అడిగే దమ్ము ఏ నాయకుడికైనా ఉందా అంటూ ఏపీలో రోడ్ల పరిస్థితిని తెలియజేస్తున్నాయని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -