YSRCP: అయిదేళ్లలో మూడు రెట్లు పెరిగిన వైసీపీ నేతల ఆస్తులు.. మరీ ఇంత అవినీతిపరులా?

YSRCP: వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా నేతల అక్రమాలు మొదలయ్యాయి ఇష్టానుసారంగా చేతికి దొరికినది దోచుకుంటూ సొమ్ము చేసుకున్నారు. 2019 ఎన్నికల ముందు వరకు కనీసం ఆస్తిపాస్తులు లేనటువంటి వారు కూడా ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అయ్యారు.. అయితే ఇటీవల ఎన్నికల నామినేషన్ లో భాగంగా అఫీడవిట్ లో పేర్కొన్నటువంటి ఆస్తుల వివరాలను కనుక చూస్తే వైసిపి నేతలు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారు అర్థం అవుతుంది.

వైసీపీ పార్టీలోకి వలస పక్షులుగా వాలినటువంటి మేరుగా నాగార్జున, చెవిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ వంటి వారందరి ఆస్తులు విలువలు మూడు రెట్లు అధికమయ్యాయి. ఇక రెండుసార్లు మంత్రిగా పని చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి 2019 వరకు ఒక కారు కూడా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఈయనకు ఏకంగా కోట్లలో ఆస్తులను సంపాదించారు.

ఇక ఆదిమూలపు సురేష్ 2019 ఆస్తులతో పోలిస్తే ఈసారి తన ఆస్తులు రెట్టింపు అయ్యాయి. తాను ఎమ్మెల్యేగా గెలిచిన చోట భారీ స్థాయిలో అక్రమాలు చేయడంతో ఈసారి స్థాన మార్పిడి చేసి ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 2019లో కేవలం3.22 కోట్ల ఆస్తి మాత్రమే ఉండేది అయితే 2024 సంవత్సరానికి11.78 కోట్లకు చేరుకుంది. ఇలా వైసిపిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారీ స్థాయిలో అక్రమంగా ఆస్తులను పోగుచేసుకుని కోట్లు వెనుకేసుకుంటూ ప్రజలను అప్పుల పాలు చేశారని స్పష్టంగా తెలుస్తోంది అయితే ఈ అరాచకపు పాలనకు మరికొద్ది రోజులలో ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -