President of INDIA: కాలినడకన పూరి జగన్నాధుని దర్శించుకున్న రాష్ట్రపతి.

President of INDIA: ద్రౌపది ముర్ము గారు జులైలో సర్వోన్నత పదవిని అధిష్టించిన తర్వాత మొదటి సారిగా ఒడిశాలో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ముర్ము పూరి కూడా వెళ్లి జగన్నాధుని దర్శించుకున్నారు. అయితే నిన్న జగన్నాధుని దర్శించుకున్న రాష్ట్రపతి గారు దాదాపుగా 2 కిలోమీటర్ల మేర నడిచారు. కాలినడకన పూరిలో జగన్నాధుని దర్శించారు.

తొలి ఒడిశా పర్యటనలో భాగంగా పూరీకి చేరుకున్న ముర్ము గారు.. కాలినడకన జగన్నాధుని చెంతకు వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ముందుగా నిర్ణయించిన విధంగా తన కాన్వాయ్ లో వెళుతున్న రాష్ట్రపతి గారు.. కాన్వాయ్ ని ఆపి దాదాపుగా 2కిలోమీటర్ల దూరం నడిచారు. గురువారం నాడు కాన్వాయ్ ని ఆపి, ప్రత్యేక పూజలు చేసి, జగన్నాధుని కృపకు పాత్రులవ్వడానికి గ్రాండ్ రోడ్డులో 2కిమీ. చుట్టూ నడిచారు రాష్ట్రపతి గారు.

కాలినడకన..
“భక్తి, ఆరాధన భావంతో రాష్ట్రపతి గారు తమ కాన్వాయ్ ని ఆపి, నడవాలని నిర్ణయించారు. దానితో ఆ 12 వ శతాబ్దపు మందిరానికి అభిముఖంగా.. పవిత్ర గ్రాండ్ రోడ్డులో 2 కిలోమీటర్లు నడిచి ఆ జగన్నాధుని దర్శించారు.” అని రాష్ట్రపతి గారి భద్రతను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఒడిశా పోలిసు అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ నడక సమయంలో రాష్ట్రపతి గారు ప్రజల వైపుగా చేతులు ఊపుతూ, వారికి అభివాదం చేస్తూ.. వెళ్లడమే కాక, కొన్ని పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు కూడా వారిని అనుసరిస్తూ ఆలయం వైపు వెళ్లారు. అని ఆ అధికారి తెలియజేసారు.

అలా నడిచి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి గారు.. పవిత్ర జగన్నాథ పుణ్యక్షేత్ర గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసారు. వేదపండితులు ఈ ప్రత్యేక పూజలు జరిపించి తదనంతరం ఆశీర్వచనాలు పలికారు. రాష్ట్రపతి గారి పర్యటన, దర్శన సమయంలో సాధారణ భక్తుల దర్శనాలను ఆపివేశారు.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -