Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎలక్షన్స్ జరిగితే అందులో ఐదు సార్లు తెదేపా గెలవటం గమనార్హం. వైసీపీ ఆవిర్భావం తర్వాత గత ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో వైసీపీ విజయం అందుకుంది. ఇక ప్రస్తుత పోటీలో వైసీపీ నుంచి ధర్నాల తిరుపతిరావు, తెదేపా నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తున్నారు.

గత ఎన్నికలలో వైసీపీ తరఫున గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తెదేపా నుంచి బరిలో ఉన్నారు. దీంతో కృష్ణ ప్రసాద్ పై ఆగ్రహించిన వైసీపీ అధినేత ఆగ్రహించి అతడిపై సాధారణ జడ్పీటీసీ ని నిలబెట్టి వసంత ని ఓడించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్నారు జగన్. నిజానికి మైలవరం నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు విలక్షణంగా ఉంటుంది. 1955లో అక్కడి ఓటర్ల సంఖ్య 52,031 కాగా ప్రస్తుతం 2,81,732 మంది ఉన్నారు. వారు వలస చేతలని చూడకుండా నియోజకవర్గానికి ఏం చేస్తాడని ఆలోచించి ఓటు వేస్తారు.

మైలవరం నియోజకవర్గ విజయవాడ చెంతనే ఉంటుంది. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి పొడుగునా విస్తరించి ఉండే ఈ నియోజకవర్గ పారిశ్రామికంగానూ భౌగోళికంగానూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రధానమైన నియోజకవర్గాల్లో ఒకటి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద గోదావరి కృష్ణాలో కలిసే పవిత్ర ప్రాంతాన్ని పవిత్ర సంఘమంగా నామకరణం చేసి పర్యాటక ప్రదేశంగా తెదేపా ప్రభుత్వం అభివృద్ధి చేసింది. మూలపాడు అటవీ ప్రాంతంలో ట్రాకింగ్ స్పాట్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టింది.

ఈ నియోజకవర్గంలో 1,36,740 మంది పురుష ఓటర్లు ఉంటే 1,44,972 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే 8,232 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో గెలిస్తే మంత్రి పదవి పక్కా, అందుకు ఉదాహరణగా 1999లో వడ్డే శోభనదీశ్వరరావు తెదేపా తరఫున గెలుపొంది మంత్రిగా 2004 వరకు పని చేశారు. 2014లో తెదేపా తరఫున గెలుపొందిన దేవినేని ఉమా మంత్రిగా 2019 వరకు కొనసాగారు. ఈసారి తెదేపా తరఫున వసంత కృష్ణ ప్రసాద్ గెలిస్తే తప్పకుండా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు వసంత సన్నిహితులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -