YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందనే చెప్పాలి. వైసీపీ ప్రకటించిన పథకాలని ఒకసారి విశ్లేషిద్దాం. కూటమి అధికారంలోకి వస్తే వికలాంగులకి, వృద్ధులకి 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే వైయస్ జగన్ మేనిఫెస్టోలో పెన్షన్ నెలకి 500 పెంచుతూ పోతామని చెప్పారు.

అంటే నాలుగేళ్లు మూడు వేల రూపాయలు చొప్పున ఇచ్చి ఆ తర్వాత ఏడాది 3250, ఐదో సంవత్సరం 3,500 ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే అమ్మ ఒడిని 15000 నుంచి 17,000 కి పెంచి, రెండు వేల రూపాయలు పాఠశాల నిర్వహణకు మినహాయిస్తామని తెలిపింది వైసీపీ. అయితే వైసీపీ ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తే తాము ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మ ఒడిని 15000 చొప్పున అమ్మఒడి ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.

అలాగే టీడీపీ ప్రభుత్వంలో 72% మేర పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేశారు.రివర్స్ టెండరింగ్ అంటూ వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ ని మార్చివేసింది, అలాగే గత ఐదేళ్లలో జిల్లాలో వరి రైతులకు ఉపయోగపడే కాలువలను మరమ్మతులు చేపట్టలేకపోయారు, బిల్లులు చెల్లించలేదు అందుకే ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో ని ఎవరు పెద్దగా నమ్మడం లేదు అలాగే జగన్ హయంలో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ ని తొలగించారు.

ఈ విషయం మీద కూడా జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. కూటమి మాత్రం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ కోర్సులకి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తానని చెప్పింది. వైయస్సార్ చేయూతను అమ్మ ఒడిని మరింత పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు జగన్. అయితే గతంలో ఇచ్చిన హామీలకే అనేక కొర్రీలు విధించిన విషయం మహిళలు మరచిపోలేదు. అందుకే ఈసారి మహిళల సపోర్ట్ కూడా వైసీపీకి పెద్దగా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -