Viral News: ఆస్తి కోసం కన్న తల్లి మీద కర్కషత్వం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కొడుకు నిర్వాకం!

Viral News: కడుపులో పుట్టిన పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులు ఎంతలా కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పిల్లలకు మంచి చదువు, బుద్ధి నేర్పించి.. వారిని ప్రయోజకులను చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. అందుకోసం ఎన్నో త్యాగాలు చేస్తూ, ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ ఉంటారు. పెరిగి పెద్దైన పిల్లలు మాత్రం వారిని ఆస్తి కోసం హింసించడం చాలాసార్లు మనం వింటూనే ఉంటాం. తాజాగా బిహార్ లో ఇలాంటి ఓ దయనీయ ఘటన జరిగింది.

 

 

బిహార్ కు చెందిన ఓ మహిళ.. తన కొడుకును ఎంతో కష్టపడి చదివించింది. అతడు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో.. ఇక తన కష్టాలు అన్నీ పోతాయని అనుకుంది. అతడికి పెళ్లి చేశాక.. పెళ్లాం మాటలు వింటూ తల్లిని పట్టించుకోవడం మానేశాడు. ఆ తర్వాత తన భార్య మాటలు విని ఆస్తి కోసం తల్లిని వేధించడం మొదలుపెట్టాడు. ఏకంగా తల్లి మీద పిడిగుద్దులు కురిపిస్తూ హింసించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

 

 

బిహార్ రాష్ట్రం హాజీపూర్‌కు చెందిన పూల్ కుమారి అనే వృద్ధురాలికి మనోజ్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు ప్రయోజకుడు కావాలని అతడిని ఎంతో కష్టపడి చదివించింది. మనోజ్ కూడా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. అతడు ప్రస్తుతం జలవనరుల శాఖలో సబ్ డివిజనల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే భార్య మాటలు విన్న అతడు.. ఆస్తి కోసం తల్లి మీద దాడికి పాల్పడటం మొదలుపెట్టేశాడు. ఆస్తి మొత్తం తన పేరు మీదకు మార్చాలని ఆమెను వేధించడం, దాడికి దిగడం లాంటి చేస్తూ ఉన్నాడు.

 

 

ఈ మధ్యన అతడు ఆస్తి కోసం తల్లి మీద దాడికి పాల్పడ్డాడు. తన్న తల్లిని కాలుతో తన్నుతూ, ముఖం కమిలిపోయేలా పిడిగుద్దులు గుద్దడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం తప్పని తండ్రి వారిస్తున్నా అతడిని పక్కకు తోసేసి మరీ తల్లి మీద మనోజ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తల్లి తీవ్రంగా గాయపడగా.. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు రాగానే మనోజ్ దొరక్కుండా పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మనోజ్ కోసం వెతుకుతున్నారు. తల్లి మీద దాడికి పాల్పడిన మనోజ్ ను శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -