Armaan Malik : స్టార్ సింగర్ చేసిన పని ఇదా.. నెటిజన్ల కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Armaan Malik : అర్మాన్ మాలిక్.. ఉర్రుతలూగించే పాటలు, ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కంటెంట్, ఫిట్నెస్, షార్ట్స్ తో మంచి కంటెంట్ తో యు ట్యూబ్ ను షేక్ చేసే ఇతగాడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిలియన్స్ సబ్స్క్రైబర్స్, లక్షల్లో వ్యూస్ తో ఎలాంటి వీడియో అయిన మంచి ఫాలోయింగ్ పొందుతున్నారు. అయితే ఇటీవల అర్మాన్ మాలిక్.. దారుణంగా ట్రోల్స్ కు గురి అయ్యారు. ఎందుకో మీరే చూడండి.

 

ఇన్‎స్టా లో ఫ్యామిలీ ఫోటోకు దారుణంగా కామెంట్స్.
ఇటీవల అర్మాన్ మాలిక్ తన ఫ్యామిలీ ఫోటో షేర్ చేసాడు. అయితే ఈ ఫొటోలో తన ఇద్దరు భార్యలు కడుపుతో ఉండడం విశేషం. ఇక ఈ పాయింట్ తో దారుణమైన కామెంట్స్ తో ట్రోలింగ్ కు దిగారు నెటిజెన్స్. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై ఫ్యామిలీ అని క్యాప్షన్ ఇచ్చారు. తన సంతోషాన్ని ఎంతో కాలం ఉండనివ్వలేదు అభిమానులు. ఈ ట్రోల్స్ తో ఫోటోలు ఎందుకు అప్ లోడ్ చేశానురా నాయన అని నోటిఫై వేలు వేసుకునే పరిస్థితి వచ్చింది.

 

అర్మాన్ మాలిక్ కు ఇద్దరు భార్యలు. కృతిక, పాయల్. ప్రస్తుతం వీరిద్దరూ ప్రెగ్నెసీ తో ఉండడంతో అర్మాన్ మామూలోడు కాదు ఒకే సారి రెండు పంటలు పండించాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ఆడు మగాడ్రా బుజ్జి అని కొందరు కామెంట్స్ పెడుతుండగా.. మంచి ఫామ్ లో ఉన్నాడంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొందరు ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

మాలిక్ షేర్ చేసిన ఫోటోలలో.. కృతికతో ఉన్న ఫోటోలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాయల్, కృతిక ఇద్దరు ప్రెగ్నెన్సీతోనే ఉన్నారు.. కానీ మాలిక్ మాత్రం కృతికతో ఉన్న ఫోటోలను ఎక్కువగా షేర్ చేసాడు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇలా భార్యల పట్ల పక్షపాతం చూపడం ఎంతనీ, ఇలాంటి వారికి ఫ్యాన్స్ ఎలా మద్దతిస్తున్నారనో అని కొందరు మండిపడుతున్నారు. మరికొందరు ఇవేవీ పట్టించుకోకుండా శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -