One Plus monitor: మార్కెట్లోకి విడుదలైన రెండు వన్ ప్లస్ మోనిటర్ మోడల్స్?

One Plus monitor: ప్రముఖ చైనీస్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను, మోనిటర్లను, స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వన్ ప్లస్ సంస్థ మార్కెట్లోకి సరికొత్తగా రెండు కొత్త మోనిటర్లను విడుదల చేసింది. అవి ఒకటి వన్ ప్లస్ ఎక్స్ 27 కాగా మరొకటి వన్ ప్లస్ ఈ 24. ఈ రెండు రకాల మోనిటర్లను మార్కెట్ లోకి విడుదల చేసింది వన్ ప్లస్ సంస్థ. ఇకపోతే ఈ మోనిటర్ ధర ఫీచర్ల విషయానికి వస్తే.. వన్ ప్లస్ ఎక్స్ 27 మోనిటర్ ధర రూ.27,999 గా ఉంది. డిసెంబర్ 15 నుంచి ఈ మోనిటర్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే వన్ ప్లస్ మోనిటర్ ఈ 24 ధర ఎంత అన్నది ఇంకా వెల్లడించలేదు. ఈ వన్ ప్లస్ ఎక్స్ 27 మోనిటర్ 27 అంగుళాల స్క్రీన్‌తో లభించనుంది. అలాగే 2560×1140 రిజల్యూషన్‌ను ఇస్తుంది. ఇది 165 hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది ఫ్లికర్ ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కూడా అందించారు.

 

 

కాగా వన్ ప్లస్ ఈ 24, 25 అంగుళాల స్క్రీన్ తో లభించనుంది. ఇది 75 hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1920×1080 రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది తక్కువ బ్లూ లైట్, యాంటీ గ్లేర్‌తో ఫ్లికర్-ఫ్రీని కలిగి ఉండనుంది. అలాగే USB-C కనెక్టివిటీ, HDMI, డీపీ , హెడ్‌ఫోన్ జాక్‌లను కూడా వన్ ప్లస్ ఎక్స్ 27 మోనిటర్ అందిస్తుంది. వన్ ప్లస్ మోనిటర్ ఈ 24 HDMI ప్లస్ హెడ్‌ఫోన్ జాక్‌తో USB-C కనెక్టివిటీని కలిగి ఉంది. పిక్చర్, మూవీ మోడ్‌ల కోసం అడాప్టివ్ సింక్, పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. మానిటర్ ఈ 24కి అందుబాటులో లేని స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌ను కూడా ఇది కలిగి ఉంది. అలాగే బ్లాక్ స్టెబిలైజర్, స్టాండర్డ్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్ ఇంకా అడాప్టివ్ సింక్‌తో కూడిన పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇది తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేన్‌ను కలిగిన ఈ మోనిటర్ మీ కళ్ళకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Nara Lokesh: హామీలపై మీ ధైర్యం ఏంటని ప్రశ్న.. లోకేశ్ జవాబు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Nara Lokesh: ఒకప్పుడు లోకేష్ మాట్లాడితే మాట తడబడేది, అందరూ ఆయనని పప్పు అంటూ ఎగతాళి చేసేవారు. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన చెప్పే సమాధానాలకు ముక్కున వేలేసుకుంటున్నారు....
- Advertisement -
- Advertisement -