Bhandup: దారుణం.. కంటైనర్ రూపంలో ముంచుకొచ్చిన మృత్యువు?

Bhandup: మానవ జీవితం నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు మృత్యువు ఎటువైపు నుంచి ముంచుకు వస్తుందో అంచనా వేయడం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటివరకు సంతోషంగా ఉన్నవారు మరుక్షణమే ఏదో ఒకటి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా భారతదేశంలో అయితే రోడ్డు ప్రమాదంలో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలామంది అనేక రకాల చిన్నచిన్న పొరపాట్లను చేస్తూ ఉంటారు.

 

తాజాగా కూడా ఒక జంట చేసిన ఒక చిన్న తప్పు వల్ల మృత్యువు కంటైనర్ రూపంలో ముంచుకొచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ భాండూప్ టెంభిపాడ తానాజీవాడ చాల్ ప్రాంతానిక చెందిన మనోజ్ జోషి, మాన్సీ జోషి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు కొన్నేళ్ల కిందటే పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు మంచిగా ఉద్యోగాలు చేస్తూ బాగానే సంపాదిస్తూ దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతూ వచ్చింది. తాజాగా ఆ దంపతులు ఇద్దరు కలిసి కొత్త సంవత్సరం వస్తుండడంతో షిరిడి సాయిబాబాను దర్శించుకోవడం కోసం వెళ్లారు. అయితే కొంతమంది మినీ బస్సులో వెళ్ళగా దంపతులు మాత్రం కూతురుతో కలిసి బైక్ మీద వెళ్లారు.

 

అయితే ఈ దంపతులు చేసిన పెద్ద తప్పు బైక్ లో వెళ్లడమే అని చెప్పవచ్చు. అయితే వీరు భివండీ పరిధిలతోని యెవైనానా వద్దకు చేరుకోగానే వీరు ప్రయాణిస్తున్న బైక్ ను వెనకాల నుంచి బలంగా ఓ భారీ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మనోజ్ జోషి, మాన్సీ జోషి దంపతులు అక్కడిక్కడే మరణించారు. అది గమనించిన స్థానికులు వెంటనే వారిని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పటికీ ప్రయత్నం లేకుండా పోయింది. అప్పటికే ఆ దంపతులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోగా వారితో పాటు కలిసి ప్రయాణిస్తున్న వారి కూతురు అదృష్టవశాత్తు గాయాలతో బతికి బయటపడింది. ఆ దంపతులకు కూతురు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కూతురు ఎవరు లేని అనాధగా మారి ఏడుస్తూ ఉంది. ఆ సంఘటన ఎక్కడున్నా వారిని కలిచివేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -