Michael Neser: ఇలాంటి క్యాచ్ క్రికెట్‌లోనే నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్

Michael Neser: క్రికెట్‌లో కొన్నిసార్లు నమ్మశక్యం కాని ఘటనలు చోటుచేసుకుంటాయి. కొందరు ఆటగాళ్లు అద్భుతరీతిలో ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో జరిగిన ఘటన గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఇటీవల ఆదివారం నాడు ఈ లీగ్‌లో భాగంగా సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్ వివాదాస్పదంగా మారింది. దీంతో కొత్త సంవత్సరం మొదలైన రోజునే మరో కొత్త కాంట్రవర్సీ క్రికెట్‌ను చుట్టుముట్టింది.

 

ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ మైకెల్ నేసర్ కష్టపడి అందుకున్నాడు. అయితే చివరి నిమిషంలో అతడు బ్యాలెన్స్ నిలుపుకోలేక బౌండరీ దాటేశాడు. ఆ సమయంలో తెలివిగా ఆలోచించిన అతడు బంతిని గాల్లోకి ఎగరేశాడు. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి ఆ బంతిని పట్టుకున్నాడు. దీంతో బ్యాటర్ అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు నోరెళ్లబెట్టారు.

 

తొలుత ఈ బంతి సిక్సర్ అవుతుందని అభిమానులందరూ భావించారు. కానీ ఫీల్డర్ అనూహ్యంగా స్పందించి విన్యాసాలు చేయడంతో అంపైర్ అవుట్ ప్రకటించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. బౌండరీ లైన్‌ దాటి బయటకు వెళ్లిన బంతిని మైదానంలోకి పంపి క్యాచ్ పడితే అది అవుట్ ఎలా అవుతుందన్న చర్చ ప్రారంభమైంది.

 

ఇక నుంచి బౌండరీ లైన్ దాటి ఫీల్డింగ్ చేస్తారా?
ఈ మ్యాచ్‌లో సదరు బంతిని అవుట్ ఇవ్వడంపై అంపైర్ సమర్ధించుకున్నాడు. మైఖేల్ బౌండరీ బయటి నుంచి బంతిని మైదానంలోకి పంపే సమయంలో అతడి కాళ్లు గాల్లో ఉన్నాయని, కాబట్టి అది అవుటేనని అంపైర్ ప్రకటించాడు. ఈ లెక్కన బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లు బౌండరీ లైన్ ఆవల నుంచి ఫీల్డింగ్ చేస్తే ఏం చేస్తారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు కూడా బంతిని టచ్ చేసే ముందు గాల్లోకి ఎగిరితే సిక్సర్ ఇవ్వరా అని నిలదీస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -