Hockey World Cup: అభిమానులకు కిక్కే కిక్కు.. ఈనెల 13 నుంచి హాకీ ప్రపంచకప్

Hockey World Cup: క్రీడాభిమానులను అలరించేందుకు మరో గోల్ ఆట వచ్చేస్తోంది. ఇటీవల ఫిఫా ప్రపంచకప్ కావాల్సినంత మజాను అందించగా మరో నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే హాకీ ప్రపంచకప్ మరోసారి అభిమానులకు కిక్ ఇవ్వనుంది. ఈనెల 13 నుంచి హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మొత్తం 16 జట్లు నాలుగు ఫూల్‌లుగా విడిపోయి ఈ టోర్నీలో తలపడనున్నాయి. భువనేశ్వర్, రూర్కెలాలలో హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

 

ఫూల్-ఎలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా.. ఫూల్-బిలో బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా. ఫూల్-సిలో చిలీ, మలేషియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్.. ఫూల్-డిలో ఇంగ్లాండ్, భారత్, స్పెయిన్, వేల్స్ ఉన్నాయి. ప్రతి ఫూల్‌లోని జట్టు మిగతా మూడు జట్లతో తలపడనుంది. ఫూల్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుతుంది. నాలుగు ఫూల్స్ నుంచి నాలుగు జట్లు క్వార్టర్ ఫైనల్ రేసుకు చేరతాయి.

 

ప్రతి ఫూల్‌లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్ ఓవర్స్‌లో తలపడేందుకు అర్హత సాధిస్తాయి. ఈ క్రాస్ ఓవర్స్‌లో ఒక ఫూల్‌లోని జట్లు మరో ఫూల్‌లోని జట్లతో నాకౌట్ మ్యాచ్‌లలో తలపడతాయి. అందులో నుంచి మరో నాలుగు జట్లు క్వార్టర్స్ చేరతాయి. అనంతరం సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. ఇప్పటివరకు 14 ప్రపంచకప్‌లు జరగ్గా 1971లో హాకీ ప్రపంచకప్‌ను తొలిసారిగా నిర్వహించారు. మొదట్లో రెండేళ్లకొకసారి నిర్వహించిన ఈ టోర్నీని ప్రస్తుతం నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తున్నారు.

 

హాకీ ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా ప్రయాణం
ఇప్పటివరకు 14 సార్లు హాకీ ప్రపంచకప్ జరగ్గా భారత్ ఒక్కసారి మాత్రమే విశ్వవిజేతగా నిలిచింది. 1975లో టీమిండియా ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకుంది. 1973లో రన్నరప్‌గా, 1971లో మూడో స్థానంతో టీమిండియా సరిపెట్టుకుంది. ఇప్పటివరకు అత్యధికంగా పాకిస్థాన్ నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. కాగా పురుషుల హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. 1981-82, 2010, 2018లో హాకీ ప్రపంచకప్ భారత్‌లోనే జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -