Uttarakhand: పూజకు ఆటంకం కలిగిందని 5 మంది గొంతులు కోశాడు..

Uttarakhand: హిందువుల ఇళ్లలో పూజలు చేయడము సర్వసాధారనమే. ఎవరికిష్టమొచ్చిన దేవుళ్లకు వారు పూజలు చేస్తుంటారు. కొంతరు మాత్రం కఠోర పూజలు చేస్తుంటారు. అలాంటి వారిని డిస్ట్రబ్‌ చేస్తే ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. తన పూజలకు ఆటంకం కలిగిస్తే ప్రాణాలు సైతం తీయడానికి వెనకాడటం లేదు. ఉత్తరాఖండ్‌లోని ఓ వ్యక్తి తాను పూజ చేస్తుంటే వారి వల్ల పూజకు ఆటంకం కలిగిందని భార్యతో పాటు ముగ్గురు కూతుర్లు, తల్లిని అతిదారుణంగా పొడిచి చంపాడు.

ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూరంలోని రాణీపోఖ్రి ∙గ్రామానికి చెందిన మహేష్‌ కుమార్‌ (47) భార్య నీతుదేవి(37), ముగ్గురు పిల్లలు అపర్ణ(9), స్వర్ణ(11), అన్నపూర్ణ(13) మహేష్‌ తల్లి బీతన్‌ దేవి(75)తో కలిసి నివాసముంటున్నారు. వీరి పెద్ద కూతురు కృష్ణ (15) రుషికేషిలో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఉంyì చదువుకుంటుంది. మహేష్‌ కుమార్‌ ఏం పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ దేవుళ్ల పూజలు ఎక్కువ చేస్తుంటాడు. స్పెయిన్‌లో ఉన్న మహేష్‌ సోదరుడు ఉమేష్‌ పంపే డబ్బులతోనే మహేష్‌ కుటుంబం జీవనం సాగించేది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం మహేష్‌ ఇంట్లో పూజలు చేస్తున్నాడు. అదే సమయంలో భార్య నీతూ వంట చేస్తుండగా గ్యాస్‌ అయిపోవడంతో సిలిండర్‌ మార్చాలని మహేష్‌ ని కోరింది. ఆమె అలా అడగటమే.. ఆ ఘటనకు దారి తీసింది. పూజలో ఉన్న మహేష్‌కు కోసం వచ్చి తన పూజకు ఆటకం కలిగించిందని ఒక్కసారిగా వంట గదికి వెళ్లి అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో నీతూ గొంతు కోశాడు. అరుపులు విని అడొచ్చిన ముగ్గురు కూతుళ్లు, తల్లిని కూడా క్షణం ఆగకుండా ఒకరి తర్వాత ఒకరి గొంతులు కోసేశాడు. వీరి పొరిగింట్లో ఉంటున్న సుభోద్‌ జైస్వాల్‌ అనే వ్యక్తి అరుపులు కేకలు విని కిటికీలో నుంచి చూడగా మహేష్‌ కుమార్‌ కుటుంబాన్ని అంతీఆ కత్తితో పొడిచి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహేష్‌ కుమార్‌ను జైలుకు తరలించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -