Inter Exams: నిమిషం రూల్ తీసేస్తే బెటర్.. విద్యార్థుల జీవితాలలో ఆటలా?

Inter Exams: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యాశాఖ అధికారుల అనాలోచిత వైఖరి అసంఖ్యాక విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. ఏ రెండు గడియారాలు ఒకే సమయం చూపవన్న వాస్తవం తెలిసి కూడా నిమిషం నిబంధనను ఇంటర్ అధికారులు అమలు పరచడం వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదంటూ పరీక్షల నిర్వహణ సందర్భంగా విధిస్తున్న ఈ నిబంధన పలువురు విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారుతున్నది.

పరీక్షలు లక్ష్యాత్మక సోపానాలు. విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా గుర్తింపు పొందిన పరీక్షలు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నవి. విజ్ఞానాన్ని వెలికి తీయాల్సిన పరీక్షలు విద్యార్థుల ముందడుగుకు అవరోధం కాకూడదు. గతంలో లేనంత సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల బోధన, అభ్యసన ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవాలి. అభ్యసన సులభ సాధ్యం కావాలి. కొత్త పరిశోధనలు ఆవిష్కరణలు విద్యా వ్యవస్థకు నూతనోత్తేజం కలిగించాలి. కానీ ప్రస్తుతం ఇంటర్ విద్యా వ్యవస్థ లో కనీస వసతుల లోటు, సామర్ధ్యం పటిమ నిండిన బోధకుల కొరత, యాంత్రికమైన బోధనా విధానాలు మొత్తం వ్యవస్థను నీరుగారుస్తున్నాయి.

 

ప్రస్తుతం రాష్ట్రంలో 1473 పరీక్ష కేంద్రాల్లో 9,51,022 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మార్చి 15 న ప్రారంభమై, ఈ పరీక్షలు ఏప్రిల్ 3న పూర్తవుతాయి. గత ఏడాది ఇంటర్ పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో పది మంది, వేములవాడలో ఇద్దరు నిమిషం నిబంధనతో పరీక్షలకు దూరమయ్యారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఖమ్మం నగరానికి పరీక్ష రాయడానికి వచ్చిన భూక్య దేవి అనే విద్యార్థినికి సమయానికి బస్సు దొరకక పది నిమిషాలు ఆలస్యంతో ఇంటర్ పరీక్ష రాయలేక పోయింది. అర్థం పర్థం లేని నిమిషం నిబంధన చట్రాల్లో విద్యార్థులను బిగించవద్దని పలువురు కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -