Medak: వివాహితతో సంబంధం.. కూతుర్ని కూడా వదల్లేదు.. కానీ?

Medak: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చాలామంది భార్య భర్తల వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాలను చేర్చేతులను నాశనం చేసుకోవడంతో పాటు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది భార్యాభర్తలు వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నారని ఒకరినొకరు చంపకున్న ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. కొంతమంది దుర్మార్గులు పరాయి స్త్రీలతో వివాహేతర సంబంధాలు కొనసాగించడంతోపాటు వారి కూతుర్లను కూడా విడిచిపెట్టడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

అసలు ఏం జరిగిందంటే.. ఈ సంఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలోని నందిగామ గ్రామంలో రాములు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రాములు స్థానికంగా పని చేస్తూ ఉండేవాడు. అతనికి అదే గ్రామానికి చెందిన వివాహిత అయిన వీరమణి తో వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరూ కలిసి సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ వచ్చారు. కాగా, రాములు అప్పుడప్పుడు ప్రియురాలి ఇంటికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే వీరమణి కూతురుని చూశాడు. దీంతో ఆ వ్యక్తి ఆ అమ్మాయి పై కన్నేశాడు. చూడడానికి అందంగా ఉండడంతో ఎలాగైన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు రాములు. ఇక అప్పటి నుంచి ఆ యువతిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇదే విషయం కొన్ని రోజుల తర్వాత వీరమణికి తెలిసింది.

 

బుద్ది మార్చుకోవాలంటూ ఆ వివాహిత ప్రియుడికి ఎన్నో సార్లు చెప్పి చూసింది. అతడి ప్రవర్తనలో మార్పు మాత్రం రాలేదు. దాంతో వీరమణి ఎలా అయిన రాములును ప్రాణాలతో లేకుండా చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే వీరమణి తన బంధువుల్లోని మ్యాదరి నర్సింలు, వీర్ సింగ్, పట్నం మహేష్, మ్యాదరి స్వప్నలకు జరిగిందంతా వివరించింది. దీనికి వీళ్లు కూడా సరే అని అన్నారు. వీరమణి వీళ్లతో పాటు స్నేహితులైన మహమ్మద్ ఆరీఫ్, మెదక్ పట్టణం ఫతే నగర్ కు చెందిన అనిరుధ్ సహాయం కూడా తీసుకుంది. ఇక ఈ నెల 17న రాములును నమ్మించి మెదక్ లోని అనిరుధ్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడితో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఇక అనంతరం ఇనుప రాడ్డుతో రాములు తలపై బలంగా బాదడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతడి శవాన్ని సంచిలో చుట్టి ఏడుపాయల చెక్ డ్యాం సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి విపరీతమైన దుర్వాసన వచ్చింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అది రాములు మృతదేహంగా గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -