Thyroid: థైరాయిడ్ ఉన్నవారు ఆ 3 పదార్థాలు తింటే అంతే సంగతులు?

Thyroid: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. థైరాయిడ్ అనేది ఒక గ్రంథి. ఈ థైరాయిడ్ మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. రోజురోజుకీ ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. థైరాయిడ్ సమస్య హార్మోన్ పెరుగుదల కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా మందిలో శరీర బరువుతో పాటు, రక్త హీనత ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవారు మూడు రకాల ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. మరి థైరాయిడ్ సమస్య ఉన్నవారు తినకూడని ఆ మూడు రకాల ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముందుగా చేయాల్సింది మొదట టీ కాఫీలు లాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఇందులో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి థైరాయిడ్ పరిమాణాలను పెంచే అవకాశాలు ఉన్నాయి.

 

అంతేకాకుండా వీరు సోడా, చాక్లెట్ లను కూడా తీసుకోకపోవడం మంచిది. గ్లూటెన్ రహిత పిండి..
థైరాయిడ్ కారణంగా కొందరికి శరీరంలో వాపు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గ్లూటెన్ ఫ్రీ పిండిని తీసుకోవడం చాలా మంచిది. పాల ఉత్పత్తులు.. హైపర్ థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు థైరాయిడ్ హార్మోన్ లను పెంచే ఆహారాన్ని తీసుకోకూడదు. ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నవారు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పాలతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవద్దు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -