Tollywood Heroes: ఈ టాలీవుడ్ స్టార్ హీరోలకు పెళ్లి యోగం లేదా.. అయ్యో పాపమంటూ?

Tollywood Heroes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారని చెప్పాలి ఈ లిస్ట్ కనుక తీస్తే చాలామంది ఈ లిస్టులో ఉన్నారు అయితే తాజాగా ఈ లిస్టు నుంచి మరి ఇద్దరు యంగ్ హీరోలు తప్పుకున్నారు అని చెప్పాలి. పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక మరొక హీరో వరుణ్ తేజ్ కూడా నటి లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి ఒక్కొక్కరు బయటకు.

ఇకపోతే ఈ లిస్టులో మోస్ట్ సీనియర్ ఎవరు అంటే అందరూ టక్కున ప్రభాస్ పేరు చెబుతారు. ప్రభాస్ పెళ్లి గురించి తరిచు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ప్రభాస్ పెళ్లి శుభవార్త ఎప్పుడు చెబుతారా అని అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈయన పెళ్లి గురించి రోజు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈయన మాత్రం అధికారకంగా తెలియచేయలేదు.

ఇలా ప్రభాస్ తో పాటు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో సీనియర్ నటుడు తరుణ్ కూడా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ లిస్టు కనక చూస్తే అఖిల్, అల్లు శిరీష్ విజయ్ దేవరకొండ బెల్లంకొండ శ్రీనివాస్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలందరూ కూడా మనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులోనే కనపడతారు. అలాగే నటుడు అడవి శేషు సైతం ఇదే లిస్టులో ఉన్నప్పటికీ ఈయన మాత్రం అక్కినేని మేనకోడలు సుప్రియతో రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా పెళ్లి ప్రస్తావనకు తీసుకురాకుండా ఈ హీరోలందరూ తమ సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా ఉండడంతో బహుశా ఈ హీరోలకు ఈ జన్మలో పెళ్లి యోగం లేదేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ శర్వానంద్ పెళ్లి చూసైనా మరికొందరు వీరిలో పెళ్లికి సిద్ధమవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -