Annapurna Devi: అన్నం తినే సమయంలో ఈ తప్పులు చేస్తే మాత్రం అన్నం దొరకదట.. చేయకూడని తప్పులివే!

Annapurna Devi: మామూలుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటూ ఉంటారు. అందుకే అన్నంని పారవేయకూడదని తొక్క కూడదని అన్నం తినేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నాన్ని గౌరవించకపోతే అన్నం పుట్టదని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే అన్నం తినేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందని చెబుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల అన్నపూర్ణ దేవి మీ ఇల్లు వదిలి వెళ్ళదు. అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి తిండి తిప్పలకు లోటు ఉండదు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

హిందూ పురాణాల ప్రకారం అన్నం వండుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే అన్నం వండేటప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉంటూ వంట చేయాలి. అలా స్వచ్ఛంగా వంట చేసుకోవడం వలన అన్నపూర్ణా దేవి ఇంట్లో ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా మనం ఆహారాన్ని గౌరవించాలి. అన్నాన్ని తినేటప్పుడు కొన్ని మంత్రాలు లేదా శ్లోకాలని చదివి ఆ తర్వాత అన్నాన్ని తినడం మొదలు పెట్టాలి. ఒకసారి దేవుడిని స్మరించుకుని అన్నం తింటే మన ఇంట్లో అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది. అన్నానికి లోటు కూడా ఉండదు. ఎప్పుడూ కూడా వండిన అన్నాన్ని అవమానించకూడదు. ఎడమ చేతితో భోజనాన్ని తాకకూడదు, తినకూడదు.

కుడి చేత్తోనే అన్నాన్ని తినాలి. వండేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నిలబడి వంట చేసుకోవాలి. తూర్పు వైపు కూర్చుని భోజనం తింటే చాలా మంచిది. అన్నపూర్ణా దేవి అనుగ్రహం కలగాలంటే అన్నాన్ని మనం దానం చేయాలి. మీ స్తోమతకి తగ్గట్టుగా దానం చేసినట్లయితే మీ ఇంట అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది. కొన్ని పక్షులకి లేదంటే జంతువులకి అయినా మీరు ఆహారాన్ని పెట్టవచ్చు. ఎప్పుడు కూడా మంచం మీద కూర్చొని ఆహారాన్ని తీసుకోకూడదు. చేతులు కడుక్కోకుండా ఎప్పుడూ కూడా కంచంలో అన్నం పెట్టుకొని ఆ అన్నాన్ని పారేయకూడదు. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుని తినాలి తప్ప గొడవ పడుతూ తినకూడదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -