Ayodhya Ram: అయోధ్య రాముడికి 11 కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?

Ayodhya Ram: అయోధ్యలో బాలరాముడు అందంగా కొలువై ఉన్న వేళ రామభక్తులు వారికి తోచిన రీతిలో వారి రామ భక్తిని చాటుకుంటూ వారి స్థాయికి తగ్గ బహుమతులు తీసుకువస్తున్నారు. అలాగే గుజరాత్ కి చెందిన ఒక వజ్రాల వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహుకరించారు. ఆ కిరీటం బంగారంతో తయారు చేశారు. అందులో ముత్యాలు, రత్నాలు, వజ్రాలను చేర్చారు. ఇవన్నీ చేర్చడంతో కిరీటం బరువు 6 కిలోలు అయింది కిరీటం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని తెలిసింది.

 

సూరత్ కి చెందిన గ్రీన్ ల్యాబ్ డైమండ్ కంపెనీ వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బాలరాముడికి బహుమానంగా అందజేసింది. ప్రాణ ప్రతిష్ట కోసం ఆ కంపెనీ యజమాని కుటుంబంతో సహా అయోధ్యకి వచ్చారు తనతో తీసుకువచ్చిన కిరీటాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధాన అర్చకులకు అందజేశారు.

బాలరాముడికి కిరీటం తయారు చేయటం కోసం ఈనెల 5వ తేదీన తమ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను అయోధ్య పంపించారు విగ్రహ తల కొలతలు తీసుకున్నారు దాంతో కిరీటాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేసినట్లు విశ్వహిందూ పరిషత్ జాతీయ కోశాధికారి దినేష్ నవాడియా తెలిపారు. బంగారు కిరీటంలో నాలుగున్నర కిలోల పసుపు లోహం ఉంటుంది.

 

చిన్న మరియు పెద్ద సైజు వజ్రాలు కెంపులు, ముత్యాలు మరియు నేలమని ఇతర విలువైన రాళ్లను ఇందులో పరిచినట్లు తయారీదారులు తెలిపారు. అలాగే సూరత్ లోని మరొక జ్యువెలర్స్ అయిన కుషాల్ దాస్ జ్యువెలర్స్ యజమాని దీపక్ చోక్షి 3 కిలోల బరువు ఉన్న వెండి ఆలయ ప్రతిరూపాలను నిర్మించారని తెలిపారు. ది కుషాల్ భాయ్ జువెలర్స్ తయారు చేసిన రెండు వెండి ఆలయ ప్రతిరూపాలను ప్రధాని మోడీ మరియు భగవత్ జీ కి బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు దీపక్ చొక్షి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -