Heart-leaved moonseed: తిప్పతీగతో అలా సమస్యలకు చెక్?

Heart-leaved moonseed: ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధాలు ఉన్న మొక్కలను అందించింది. అయితే చాలామందికి ఆ మొక్కల ప్రత్యేకత తెలియక వాటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో తిప్పతీగ కూడా ఒకటి. సిటీలో ఉన్నవారు చాలామంది ఇదేదో పిచ్చి చెట్టు అనుకుంటూ దాన్ని నేను పీకేస్తూ ఉంటారు. కానీ ఈ తిప్పతీగ ఆకు గురించి పల్లెటూరికి వారికి బాగా తెలుసు. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ తిప్పతీగ చెట్టు కాలాలతో పని లేకుండా అన్ని కాలాల్లో పచ్చగా ఉండడంతో పాటు తీగలగా పాకుతూ వెళ్ళిపోతుంది. ప్రతి రోజు రెండు ఆకులను నమిలితే ఆరోగ్యానికి చాలా మంచిది.

తిప్పతీగతో జ్యూస్, పౌడర్, కాప్సూల్స్ తయారు చేసి అమ్ముతారు. మరి తిప్పతీగ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా క్రమం తప్పకుండా ప్రతి రోజు రెండు ఆకులు తినడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తిప్పతీగ ఎముకల్లో ఖనిజ శక్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎముకల వ్యాధులను నివారిస్తుంది. కాలేయాన్ని రక్షిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను నిర్వీర్యం చేయడానికి కాలేయానికి మద్దతు ఇస్తుంది. తిప్పతీగలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. అలాగే హృదయ కండరాల పని తీరు మెరుగు పడుతుంది.

 

గుండె ఆరోగ్యంగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. తిప్ప తీగ చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. వృద్ధాప్య సంకేతాలు తగ్గించి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తిప్పతీగ మధుమేహనివారిణి. ఇది క్లోమం నుండి ఇన్సులిన్ స్రావం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శ్వాస కోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా శ్వాస సంబంధిత సమస్యలు ఉబ్బసం, దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి వాటినుంచి కాపాడుతుంది. ఈ తిప్పతీగ ఆకును ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ తిప్పతీగ ప్రయోజనాలు తెలియడంతో చాలామంది తిప్పతీగ ఆకును తినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా సిటీలో ఉన్న వారు చాలామందికి ప్రత్యేకంగా ఈ మొక్కలను ఇంట్లో పెరట్లో పెంచుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -