Karthikadeepam: ఆ రికార్డును అందుకున్న కార్తీకదీపం.. దండం అంటూ?

Karthikadeepam: కార్తీకదీపం సీరియల్ ఫేమ్ వంటలక్క, డాక్టర్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చారు. సీరియల్ సక్సెస్ అవ్వడంతో సెలబ్రేషన్స్ తో ప్రేక్షకుల ముందుకు గుడ్‌న్యూస్‌తో వచ్చారు. కార్తీకదీపం సీరియల్ నేటితో 1,500 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. బుల్లితెర బహుబలిగా మరో మైలు రాయిని దాటింది. తన ఖాతాలో మరో అరుదైన రికార్డును నమోదు చేసుకుంది. 2017 అక్టోబర్ 16వ తేదీన ప్రారంభమైన ఈ సీరియల్ ఐదేళ్లుగా నిర్విరామంగా కొనసాగుతోంది. తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. బుల్లితెర చరిత్రలో తిరుగులేని రికార్డులను క్రియేట్ చేసింది. 1,500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో నంబర్.1 సీరియల్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో డాక్టర్ బాబు, వంటలక్క ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చారు. తమ అభిమానులతో ముచ్చటించారు.

 

 

ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ.. ‘నిజానికి లైవ్‌లోకి వస్తామని అనుకోలేదు. షూటింగ్ మధ్యలో చిన్న విరామం దొరికింది. అందుకే మీ ముందు ఇలా లైవ్‌లోకి వచ్చాం. ఈ రోజు కార్తీక దీపం 1,500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్‌ మా ఒక్కరిది కాదు. ప్రతిఒక్కరిది.. ప్రేక్షకుల నుంచి విషెష్ అందుతున్నాయి. ఇంత సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటనే ప్రేక్షకుల ఆదరణ, ప్రోత్సాహమే కారణం. 1,000 ఎపిసోడ్స్ పూర్తి అయినప్పుడు బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు 1,500 ఎపిసోడ్లు సంబంధించి సెలబ్రేషన్స్ లేవా అని ప్రేక్షకులు అడుగుతున్నారు. కేక్ కటింగ్‌తోపాటు లంచ్ ప్లాన్ చేశాం. కార్తీకదీపం సీరియల్ రేటింగ్‌లో నంబర్.1 స్థానంలో ఉంది. ఇంత సక్సెస్ రావడానికి మీ అందరి ప్రోత్సాహమే కారణం. ముఖ్యంగా గృహిణులకు, పెద్దవాళ్లకు రుణపడ్డాం. వాళ్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్లు సీరియల్‌పై చూపిస్తున్న ఆదరణ వల్లే తర్వాతి జనరేషన్ వాళ్లు కార్తీకదీపం సీరియల్‌ను చూస్తున్నారు. అలా వారికీ కార్తీకదీపం సీరియల్ అలవాటు అవుతోంది. మీ అందరి సపోర్ట్ మాకు ఇలాగే అందించాలి. కార్తీక దీపం సీరియన్ ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్లాలి.’ అని వంటలక్క ప్రేమి విశ్వనాథ్, డాక్టర్ బాబు కార్తీక్ ధన్యవాదాలు తెలియజేశారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -