Actor Racha Ravi: చంద్రన్న లేకపోతే ఈరోజు నేను లేను.. రవి ఎమోషనల్ కామెంట్స్?

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతూ ఎంతో మందికి లైఫ్ ఇచ్చాయని చెప్పాలి. ఇలా బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమై నేడు ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇదే తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలు కూడా ఎంతో మందికి లైఫ్ ఇచ్చాయని చెప్పాలి. ఇప్పటికే స్టార్ మా ఈటీవీ ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

ఇదే తరహాలోనే జీ తెలుగులో కూడా ఒక కామెడీ షో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మన వూరి రంగస్థలం పేరుతో ఓ కొత్త షో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం కానుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చ రవి ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చమ్మక్ చంద్ర లేడీ గెటప్ లో సందడి చేశారు.చమ్మక్ చంద్ర లేడీ గెటప్ చేస్తే ఎలాంటి రచ్చ ఉంటుందో మనం జబర్దస్త్ కార్యక్రమంలో చూసాము. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన లేడీ గెటప్ లో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇక జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రచ్చ రవి ఒక్కసారిగా చమ్మక్ చంద్ర కాళ్లపై పడి ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది.

ఈ విధంగా చమ్మక్ చంద్ర కాళ్లపై పడిన రచ్చ రవి అనంతరం మాట్లాడుతూ ఆరోజు చమ్మక్ చంద్ర అన్న నాకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండే వాడిని కాదు అంటూ చంద్ర కాళ్ళపై పడ్డారు.అనంతరం చంద్ర మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చినప్పుడు నాకు 1500 రూపాయలు ఇచ్చి పంపించారని అప్పటి విషయాలను గుర్తుచేసుకొని రచ్చ రవి, చమ్మక్ చంద్ర ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -