Adani Group: అదానీ గ్రూప్ కు రూ.కోట్ల అప్పులు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Adani Group: ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా పేరొందిన ఇండియాకు చెందిన అదానీ గ్రూప్ ఛైర్మన్ అప్పుల ఊబిలో చిక్కుకుందని ఫిచ్ గ్రూప్ సంస్థ క్రెడిట్ ఫైల్స్ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు, కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ భారీగా అప్పులు చేస్తోందని ఫిచ్ గ్రూప్ సంస్ధ క్రెడిట్ ఫైల్స్ తాజాగా విడుదల చేసిన తమ నివేదికలో కీలక విషయాలు పేర్కొంది. వ్యాపారాన్ని త్వరగా పెంచుకోవాలన్న లక్ష్యంతో అప్పులు చేస్తున్న అదానీ గ్రూప్.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

అదానీ గ్రూప్.. డిప్లీ ఓవర్ లివరేజ్జ్ అనే పేరిట ఈ రిపోర్టును క్రెడిట్ ఫైల్స్ విడుదల చేసింది. అప్పుల తీర్చలేక భవిష్యత్తుల్లో రుణాలు ఎగ్గొట్టే అవకాశముందని హెచ్చరించింది. తమకు సంబంధం లేని కొత్త వ్యాపారాల్లకి అదానీ గ్రూప్ అడుగుపెడుతుందని, దాని కోసం భారీగా అప్పులు చేస్తోందని రిపోర్టులో వివరించింది. 2021-22 చివరకు అదానీ గ్రూప్ కు చెందిన 6 కంపెనీల రుణాలు రూ.2,30,900 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక నగదు నిల్వ లెక్క వేస్తే నికర రుణాలు రూ.1,72,900గా ఉందని స్పష్టం చేసింది.

తమకు అసలు అనుభవం లేని కాపర్ రిఫైనింగ్, పెట్రో రసాయనాలు, టెలికాం, అల్యూమినియం ఉత్పత్తి, మీడియా రంగంలోకి అదానీ గ్రూప్ అడుగుపెట్టిందని తెలిపింది. కొత్త కంపెనీల్లో లాభాలు వెంటనే రావని, రావడానికి నాలుగైదు సంవత్సరాల సమయం పడుతుందని తెలిపింది. లాభాలు రాకపోవడం వల్ల తీసుకున్న అప్పులను చెల్లించడానికి డబ్బులు ఉండవని, దాని వల్ల నష్టం జరుగుతుందని తెలిపింది. ఫిచ్ గ్రూప్ సంస్థ తన రిపోర్టును బయటపెట్టడంతో అదానీ గ్రూప్ షేర్లు పడిపోయాయి. అదానీ పవర్ 4.99 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 0.93 శాతం, అదానీ పోర్టస్ షేర్లు .032 శాతం నష్టపోయాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -