Ravindra Mishra Success Story: 6000 మంది ఆడపిల్లలను చదివిస్తున్న ఐపీఎస్ ఆఫీసర్.. ఇతను నిజంగా గ్రేట్ అంటూ?

Ravindra Mishra: ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు సరైన సంపాదన లేక పిల్లలను చదివించలేక బయట కూలి పనులకు తీసుకెళ్తున్నారు. ఇంకొందరు చదివించినప్పటికీ కేవలం గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే చదివిస్తున్నారు. కన్న కూతురు కొడుకులను కూడా చదివించడానికి ఆలోచించాల్సిన ఈ రోజుల్లో ఒక పోలీసు ఆఫీసర్ మాత్రం 100, 200 మంది కాదండోయ్ ఏకంగా 6000 మందిని చదివిస్తున్నాడు. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం.. ఆ పోలీస్ ఆఫీసర్ మరెవరో కాదు ఐపీఎస్ అధికారి రవీంద్ర మిశ్రా.

రవీంద్ర మిశ్రా 2007 సంవత్సరంలో ఒక ఆదివాసి గూడేనికి వెళ్లగా అక్కడ మహిళ సివిల్ డ్రెస్ లో ఉన్న రవీంద్రను చూసి బాబూ. కూర్చుంటారా అని వాళ్ల భాషలో అడిగగా అక్కడ ఆదివాసీ మహిళలు విటులను తమ దగ్గరకు రావాలని కోడ్ భాషలో అలా చెబుతారు. అయితే 14 ఏళ్ల బాలిక కూడా ఆ వృత్తిలో ఉండటాన్ని చూసి రవీంద్ర మిశ్రాకు బాధ కలిగింది. ఆ పాపను దత్తత తీసుకోవాలని రవీంద్ర భావించినా అక్కడి వాళ్లు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత రవీంద్ర మిశ్రా ఆ తెగ ప్రజల దుస్థితిని మార్చాలని భావించారు. అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న పిల్లలకు చదువు విలువ చెప్పి కొంతమంది పిల్లల మనస్సును రవీంద్ర మార్చారు. మొదట 13 మంది ఆడపిల్లలను రవీంద్ర మిశ్రా బడిలో చేర్పించారు.

రవీంద్ర మిశ్రా సంవేదన అనే ఎన్జీవో సహాయంతో వాళ్ల ఆలనాపాలనా చూసుకున్నారు. ఇతర జిల్లాల్లోని తెగ ప్రజల్లో కూడా రవీంద్ర మార్పు తెచ్చారు. అలా ప్రస్తుతం రవీంద్ర శర్మ ఆరువేల మంది ఆడపిల్లలను చదివిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం రవీంద్ర మిశ్రా ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఏఐజీగా చేరారు. రవీంద్ర చదివించిన ఎంతోమంది ఆడపిల్లలు పట్టభద్రులై ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఒక ఐపిఎస్ ఆఫీసర్గా ఎంతోమంది ఆడపిల్లలను చేరదీసి చదివించే విషయంలో ఇలా ఎన్నో రకాల విషయాలలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన గురించి తెలుసుకున్న చాలామంది ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తుంచడంతోపాటు ఆయనకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అప్పట్లో అలాంటి మనిషి ఉండడం చాలా రేర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -