Aloe vera: అనారోగ్య సమస్యల్ని దూరం చేసే అలోవేరా ?

Aloe vera: అలోవెరా లేదా కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కలబంద ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ, అలాగే అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కలబంద వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చాలా ఉంది కలబందను అందం కోసం ఉపయోగిస్తే మరికొందరు ఆరోగ్యం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు అమావాస్య ఆ సమయంలో కలబందను తీసుకువచ్చి ఇంట్లో కడుతూ ఉంటారు. అలోవెరా ను కేశాలకు అలాగే చర్మానికి సంబంధించిన మందుల తయారీలలో ఉపయోగిస్తూ ఉంటారు.

అలాగే కలబంద మండిన గాయాలు, దెబ్బలు, జీర్ణ సంబంధిత సమస్యలకు అల్లోవెరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే కలబందను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక ఎంజైమ్‌లు భోజనం అరుగుదల, పోషక పదార్ధాల సంగ్రహణను మెరుగుపర్చేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియ సంబంధిత సమస్యలైన స్వెల్లింగ్, మలబద్ధకం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌ను తగ్గిస్తాయి. కలబందలో పాలీశాకరైడ్స్ ఉంటాయి. వీటిని కాంప్లెక్స్ షుగర్ అంటారు.

 

ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయి. పోలీశాకరైడ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇన్‌ఫెక్షన్, వ్యాధుల నుంచి సంరక్షిస్తాయి. కలబందను తినడం వల్ల అధిక బరువు సమస్యకు చెప్పి పెట్టవచ్చు.
కలబంద జెల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, డీటాక్సిఫైయింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. బరువు తగ్గించేందుకు కీలకంగా మారతాయి. కలబందలో విటమిన్ ఎ, సి, ఇతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీర కణాలకు నష్టం కల్గిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -