Anganwadi Recruitment 2023: పది పాసైన ఏపీ మహిళలకు శుభవార్త.. సొంతూళ్లూనే అంగన్ వాడీ జాబ్ చేసి ఛాన్స్!

Anganwadi Recruitment 2023:  నిరుద్యోగ మహిళలు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా అయితే మీకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పాలి పదవ తరగతి మహిళలందరికీ కూడా సొంత ఊరిలోనే ఉద్యోగం పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి టీచర్లు వర్కర్ల పోస్ట్ లను భర్తీ చేయబోతున్నారు. మొత్తం ఖాళీగా ఉన్నటువంటి 109 పోస్టులకు అక్టోబర్ 5వ తేదీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

అక్టోబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తులను స్వీకరించబోతున్నారు.అంగన్వాడి వర్కర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడి పోస్టులు 7 ఉండగా, అంగన్వాడీ సహాయకురాలు 9, మినీ అంగన్వాడి కార్యకర్త 93 పోస్టులు ఉన్నాయి. ఇక ఖాళీలు ఏ ఏ ప్రాంతాలలో ఖాళీలు ఉన్నాయి అనే విషయానికి వస్తే…

ధర్మవరం ప్రాజెక్టులో 2, సికే పల్లి ప్రాజెక్టులో 8, మడకశిర ప్రాజెక్టులో 11, హిందూపురం ప్రాజెక్టులో 8 , కదిరి ప్రాజెక్టులో 7 , పెనుగొండ ప్రాజెక్టులో 6 ఉన్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఏకంగా 109 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిన మహిళల వయసు జూలై 1, 2022 నాటికి 21 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ వారికి వయోసడలింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే,, పోస్టులను బట్టి రూ.7000 నుండి రూ. 11000 వరకు వస్తాయి. అంగన్వాడీ టీచర్ పోస్టులకి నెలకి రూ.11500 చొప్పున జీతం అందుకు పోతున్నారు. ఇక ఈ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి అంటే ఈ క్రింది తెలిపిన లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -