AP Deputy CM: వైరల్ అవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు!

AP Deputy CM: ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తాజాగా మీడియా సమావేశంలో భాగంగా చౌదరి రెడ్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సాలూరును షెడ్యూల్డ్ ఏరియాగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సెటిల‌ర్స్ కారణంగా సాలూరులో ఉండే స్థానికులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు అంటూ ఈయన తెలియజేశారు .

ఇతర జిల్లాల నుంచి తమ ప్రాంతానికి వచ్చిన రెడ్లు చౌదరి కారణంగా తమ ప్రాంతంలో ఉండే గిరిజనులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. సెటిలర్స్ చేతిలోనే భూములు వ్యాపారాలు అన్నీ ఉన్నాయని, వీరంతా గిరిజనుల మీద బ్రతుకుతూ గిరిజనులకే అన్యాయం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సాలూరులో పెద్ద ఎత్తున వీరందరూ సంపాదించుకొని అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సాలూరు అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదని తెలిపారు.

 

ఇలా పరిస్థితులు మారాలి అంటే సాలూరును షెడ్యూల్డ్ ఏరియా గా ప్రకటించాలని ఈయన పేర్కొన్నారు.ఈ ప్రాంతంలో గిరిజనుల కోసం నిర్మించిన రహదారులు బ్రిడ్జిలు వీరికి కాకుండా ఎక్కడి నుంచి వచ్చిన వారికి ఉపయోగకరంగా మారాయి అంటూ ఈయన వెల్లడించారు. ఏళ్ల క్రిందటే సాలూరుకు వ‌చ్చి సెటిల్ అయిన వారి గురించి డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడ‌టం వెనుక రాజ‌కీయ కోణంలో చూస్తున్నారు ప్ర‌తిప‌క్షలు. ఇలా డిప్యూటీ సీఎం రెడ్ల చౌదరి గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -