AP Youth Turns as GIG Workers: హైదరాబాద్ లో గిగ్ వర్కర్లుగా లక్షల సంఖ్యలో ఏపీ యువత.. ఈ పరిస్థితి దారుణమంటూ?

AP Youth Turns as GIG Workers: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశం ఏర్పరచగా అందులో సకానికి పైగా ఆంధ్రప్రదేశ్ యువత వున్నది అని తెలిసింది. ఎవరిని అడిగినా అందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగం కోసం వలస వచ్చిన నిరుద్యోగులమే అని చెప్పుకుంటూ వచ్చారు. గిగ్ వర్కర్లు అంటే తమ వాహనాలను టాక్సీగా వాడుకునే వాళ్ళు. హైదరాబాద్కు వెళ్లి ఏ టాక్సీ బుక్ చేసినా వచ్చేవాళ్లు ఆంధ్ర ప్రదేశ్ యువతే. అక్కడ వాళ్లకి సరైన ఉద్యోగం లేక వలస వచ్చి వాళ్ళ వాహనాలనే టాక్సీలుగా వాడుకుంటూ పనిచేస్తున్నారు.

అసలు ఏపీలో యువతకు ఉద్యోగం ఎందుకు రావడం లేదు? ఎందుకంటే అమరావతిలో ఎన్నో వందల కంపెనీలను నిర్మిద్దాం అనుకున్న ఆలోచన సగంలో ఆగిపోవడం, దానివల్ల దాన్ని నమ్ముకున్న చాలామంది ఉద్యోగులకు ఉద్యోగం లేని స్థితి వచ్చింది. గత ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ యువత నిరుద్యోగ స్థాయి ఆకాశాన్ని అంటుతుంది. ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఒక డిజాస్టర్ గా మారింది అని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ.

ఏపీ యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో మరి ఏ దారి లేక హైదరాబాద్, బెంగళూరు వంటి ఏరియాస్ లో గిగ్ వర్కింగ్ చేసుకుంటున్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఏపీ యువతకు అవకాశాలు అస్సలు ఉండవు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న చిన్న కంపెనీలు కూడా ఉద్యోగం ఇవ్వడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు కానీ ఫ్రెషర్స్ కి ఉద్యోగం ఇచ్చే ఆలోచన కూడా పెట్టుకోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీస్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుక పడుతుంది?

దానికి కారణం ఇక్కడ ఏ అవకాశాలు లేకపోవడం.దీనివల్ల అందరూ వలస వెళ్లి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. మంచి చదువులు చదువుకొని ఉద్యోగం చేయవలసిన యువత గిగ్ వర్కర్లుగా, డెలివరీ బాయ్స్ గా పని చేసుకుంటూ కడుపు నింపుకుంటున్నారు. ఇప్పుడే ఇలాగుంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యువత పరిస్థితి ఇంకెంత అద్వానంగా మారుతుందో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -