Vitamin D Deficiency: విటమిన్ డి లోపంతో ఆ సమస్యలు రావడం ఖాయం?

Vitamin D Deficiency: ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాల్సిందే. లేదంటే విటమిన్ లోపం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వాటిలో విటమిన్-డి కూడా ఒకటి. విటమిన్ డి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మనకు సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అలాగే పాలు పెరుగు పన్నీర్ మష్రూమ్స్ వంటి పదార్థాల ద్వారా కూడా విటమిన్ డి లభిస్తుంది. విటమిన్ డి లోపం పూర్తి చేసేందుకు ఈ పదార్ధాలు డైట్‌లో చేర్చుకోవాలి.

ఆరెంజ్, ఆరటి పండ్లు, బొప్పాయి కూడా కీలకంగా ఉపయోగపడతాయి. అలాగే ఉదయం సమయంలో సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల విటమిన్ డి శరీరానికి లభిస్తుంది. రోజూ 10-15 నిమిషాలు నీరెండలో కూర్చుంటే విటమిన్ డి లోపం ఉండదు. ఫలితంగా ఎముకలు బలంగా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నాన్ వెజ్‌లో విటమిన్ డి చేపలు, గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ ఫిష్, ట్యూనా ఫిష్‌లో పెద్దమొత్తంలో విటమిన్ డి ఉంటుంది. నాన్ వెజ్ ఆహారంలో విటమిన్ డి చాలా ఎక్కువ.

అయితే శరీరంలో విటమిన్ డి లోపం ఎక్కువైతే ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఫలితంగా వీపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఎక్కువగా ఇది మహిళలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో విటమిన్ డి లోపముంటే అలసట, బలహీనత ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. ఎముకల పటిష్టంగా ఉండాలంటే విటమిన్ డి అవసరం. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపముంటే ఎముకలు బలహీనమౌతాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ సమస్యలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -