Nail Biting: గోర్లు కొరికే అలవాటుతో ఆ సమస్యలు రావడం ఖాయం?

Nail Biting: మనలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. ఈ గోళ్లు కొరకడం అన్నది చాలా చెడ్డ అలవాటు అన్న విషయం తెలిసి కూడా చాలా మంది వాటిని మానుకోలేకపోతూ ఉంటారు. అదే పనిగా వేళ్లు నోట్లో పెట్టుకుని గోర్లు కొరుకుతుంటారు. ఇది చూడ్డానికి సాధారణ లక్షణంలా కన్పించినప్పటికీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం కల్గిస్తుంది. మరి గోర్లు కొరికే అలవాటు ఉంటే అది ఎటువంటి సమస్యలకు దారితీస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గోర్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

లేదంటే మట్టి ఇతర మురికి పదార్థాలు చేరుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు గోర్లు కొరకడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నోట్లోకి వెళ్లి కడుపులోకి వెళ్ళిపోతుంది. ఫలితంగా ఇన్‌‌ఫెక్షన్ తలెత్తుతుంది. ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాధులకు కారణం కావచ్చు. గోర్లు కొరికే అలవాటుంటే బ్యాక్టీరియా నోట్లోకే కాదు కడుపులోకి చేరిపోతుంది. ప్రమాదకర బ్యాక్యీరియా మీ జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. గోర్లు కొరకడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.

 

గోర్లు కొరకడం వల్ల పళ్లకు హాని కలుగుతుంది. గోర్లు చాలా గట్టిగా ఉంటాయి. వీటిని కొరకడం వల్ల పళ్లు దెబ్బతింటాయి. పళ్ల ఆకారం కూడా పాడయ్యే అవకాశముంది. చిగుళ్లపై కూడా చెడు ప్రభావం పడవచ్చు. గోర్లను అదే పనిగా కొరుకుతుంటే వేళ్లు కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు. గోర్లు నమలడం వల్ల శరీరంలో పైరోనీషియా వంటి బ్యాక్టీరియా ప్రవేశించే ప్రమాదముంది. ఈ బ్యాక్టీరియా కారణంగా శరీరం నియంత్రణ కోల్పోతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -