Fast Food Fraud: ఫాస్ట్ ఫుడ్ మాయలో ఇంత మోసం చేస్తున్నారా.. పంది కొవ్వుతో ఇంత ప్రమాదమా?

Fast Food Fraud: మీరు ఫాస్ట్ ఫుడ్ ప్రియులా..ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉన్నారా అయితే ఈ విషయం కనుక తెలిస్తే ఇకపై జన్మలో ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్ళరు.రోడ్డు పక్కన బండ్లపై ఫాస్ట్ ఫుడ్ తయారు చేయడం కోసం ఉపయోగించే ఆయిల్ పూర్తిగా కల్తీ ఆయిల్ అని ఈ నూనె పంది మాంసంతో తయారు చేస్తారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుత కాలంలో నిత్యవసర సరుకుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇదే అవకాశంగా భావించినటువంటి కొందరు ప్రతి ఒక్క వస్తువులను కల్తీ తయారు చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే వంట నూనె ధరలు కూడా ఆకాశానికి తాకడంతో కొందరు కేటుగాళ్లు పంది కొవ్వుతో నూనెను తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నేరేడ్‌మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

ఆర్కేపురంలోనివాసం ఉన్నటువంటి రమేష్ శివ అనే వ్యక్తి పంది మాంసం అమ్మే వారి దగ్గర నుంచి పంది కొవ్వును కొనుగోలు చేసేవారు. ఇలా పంది కొవ్వును బాగా వేడి చేసి వాటిలోకి కొన్ని రసాయనాలు కలపటం వల్ల ఆ పంది కొవ్వు నుంచి వచ్చినటువంటి నూనె అచ్చం మార్కెట్లో లభించే వంటనూనెను పోలీ ఉంటుంది. ఇలా తయారు చేసిన ఈ నూనెను రోడ్డు వైపు ఫాస్ట్ ఫుడ్ అమ్మే వారికి చాలా తక్కువ ధరలకు విక్రయించేవారు.

 

ఇక ఈ విషయం వెలుగులోకి రావడంతో రమేష్ శివ అనే వ్యక్తి ఇంట్లోకి పోలీసులు అకస్మాక తనిఖీ చేయక అసలు బాగోతం బయటపడింది. ఈ క్రమంలోనే తనని కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు త్వరలోనే ఈయన కల్తీ నూనెను అమ్మినటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియజేశారు. ఈ విషయం తెలియక ఎంతోమంది డబ్బులు ఇచ్చి మరి తమ అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -