Eating Rice: అన్నం తినే సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా.. జనమజన్మలకు పాపం తగులుతుందంటూ?

Eating Rice: మాములుగా మనం అన్నం విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము. అన్నం తినేటప్పుడు, అన్నం తినే విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. అయితే పూర్వకాలం నుండి మన పెద్దలు పాటిస్తున్న ఆచారాలను కూడా చాలా మంది ఇంకా ఇళ్లల్లో పాటిస్తూనే ఉన్నారు. అయితే శాస్త్రాల ప్రకారం ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అంటే దేవుడితో సమానం.

కనుక వృథా చేయకూడదు. అలాగే కొన్ని రకాల పొరపాట్లు కూడా చేయకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భోజనం చేసే సమయంలో ఎవరూ కూడా భోజనం చేసే ప్లేట్ నుండి దాటకూడదు. పొరపాటున కూడా అలా దాటిన ఆహారాన్ని తినకూడదు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే పాపం చుట్టుకుంటుంది. బల్లి లేదా ఇతర కీటకాలు ఏమైనా ఆహార పదార్థాలలో పడితే అటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం దరిద్రం చుట్టుకుంటుంది. మనలో చాలామంది ఏదో ఒకసారి గొడవ పడుతూనే ఉంటారు.

 

అయితే ఏదైనా గొడవ జరిగినప్పుడు భోజనం చేయాలని అనిపించదు. అలాంటప్పుడు భోజనం చేయకుండా ఉండటమే మంచిది. అలాంటి సమయంలో భోజనం చేస్తే జీర్ణక్రియ చెడిపోతుంది. తినేటప్పుడు ఎప్పుడు కూడా మనసుపెట్టి తినాలి. లేదంటే తినడం మానేయాలి. పాకశాస్త్రం ప్రకారం భోజనంలో వెంట్రుకలు కనుక వచ్చినట్లయితే ఇంట్లో రోగాలు ఎక్కువవుతాయి. అయితే అలా వెంట్రుకలు పడిన ఆహారాన్ని తీసుకోవడం కంటే కూడా జంతువులకు పెట్టడం మంచిది. పొరపాటున ఎవరైనా తినే ఆహారంలో ఉమ్మివేసినా, ఉమ్మిపడినా ఆ భోజనం తినకూడదు. అలాంటి ఆహారం తింటే బలహీనత కలుగుతుంది. భోజనం చేసేటప్పుడు దగ్గరలో శునకాలు ఉంటే వాటికి భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా ఆహారం మీరు తిన్నట్లయితే ఆయుష్షు తగ్గుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -