Ari Movie: ఇచ్చట అన్ని కోరికలు తీర్చబడును.. ఆసక్తి రేపుతున్న “అరి” వినోద్ వర్మ ఫస్ట్ లుక్!

Ari Movie: ఆర్ వి రెడ్డి సమర్పణలో, ఆర్ వి సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా అరి. వినోద్ వర్మ,సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు పేపర్ బాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన లభించింది.

ఇటీవల అరి మూవీలోని ఒక ముఖ్యపాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఒక పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోటు చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ క్రేజీగా కనిపిస్తోంది. అరి సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది ఈ మూవీలో ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది త్వరలోనే అరి సినిమాను గ్రాండ్గా థియేటర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో విడుదలకు ముందే అభిషేక్ బచ్చన్ చిత్రాన్ని హిందీలో రీమిక్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. ఇదివరకు రిలీజ్ అయిన అరి టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. ఇచట అన్ని కోరికలు తీర్చబడును అంటూ లైబ్రరీలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక్కొక్కరుగా వెళ్లి తమ కోరికలు చెబుతూ ఉంటారు.

వారిలో అనసూయ తన అందం ఎప్పటికీ అలాగే ఉండేందుకు ఏం చేయాలో అడుగుతుంది. అలాగే ఒక్కొక్కరు చెప్పే కోరికలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అనూప్ రుబెన్స్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా, అవినాష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ కృష్ణ ప్రసాద్ శివశంకర వరప్రసాద్, కొరియోగ్రఫీ భాను జీతు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -