Kodali Nani: కొడాలి నాని నామినేషన్ విషయంలో వివాదం.. తప్పుడు సమాచారంతో ఆయనకు ఇబ్బందే?

Kodali Nani: ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని నామినేషన్ పేలవంగా జరిగిందని వార్తలు వస్తూ ఉండగానే ఆయన నామినేషన్ పై మరొక దుమారం నెలకొంది. అఫిడవిట్ లో నాని తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో నాని నామినేషన్ వ్యవహారం వివాదం లో పడింది. మునిసిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంప్ కార్యాలయంగా వినియోగించినట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు మున్సిపల్ అధికారులు సైతం పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు ఫిర్యాదుదారులు.

అంతేకాకుండా నాని తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించుకోలేదని ఆఫిడవిట్లో పేర్కొని తప్పుడు సమాచారం ఇచ్చారు, అందుకే నామినేషన్ ని తిరస్కరించాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు. మరి దీనిపై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. కొడాలి నాని నామినేషన్ కూడా చాలా పేలవంగా జరగడం, బల ప్రదర్శన నిరూపించుకోవాలని భారీగా జనాన్ని సమీకరించాలని నాని వర్గం తీవ్రంగా ప్రయత్నించింది.

అయితే ఫలితం మాత్రం శూన్యం. అందుకు కారణం గత ఐదేళ్లలో ప్రజలకి నాని ఏమీ చేయకపోవడమే అంటున్నారు ఒక వర్గం రాజకీయ నాయకులు. జనానికి మంచినీటి అవస్థలు, రహదారులపై వెతలు కనీస స్థాయిలో కూడా నాని పరిష్కరించలేకపోయారు. ఆయన ప్రచారానికి వెళితే నిలదీతలు తప్పితే ఎక్కడా స్వాగతాలు లేవు. డబ్బులు ఇచ్చి చాలా మందిని ర్యాలీగా తీసుకువస్తుండగా నెహ్రూ చౌక్ కి వచ్చేసరికి వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు.

ర్యాలీలో ఉండాలని, ఎక్కడికీ వెళ్లవద్దని వైసీపీ నేతలు బ్రతిమాలినప్పటికీ ఎవరూ వినలేదు. మనిషికి 300 మద్యం బిర్యానీ ఇస్తామని చెప్పి జనాన్ని తీసుకువచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు పెట్టి మరీ జనాన్ని తీసుకువచ్చిన వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే నామినేషన్ విషయంలో వివాదం నెలకొనటంతో మరింత ఇరుకున పడినట్లు అయింది కొడాలి నాని పరిస్థితి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -