Pawan Kalyan Nomination Rally: పిఠాపురంలో జనసునామి.. పవన్ కళ్యాణ్ ఊహించని మెజార్టీతో గెలవబోతున్నారా?

Pawan Kalyan Nomination Rally: రాజకీయాలలో కూడా పవన్ కళ్యాణ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే క్రమంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన వెనక వచ్చిన జన సముద్రాన్ని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. లక్షలాదిమంది ప్రజలు జనసేనాని వెనక తరలి వెళ్లారు. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీ సమయంలో యువకులతో పాటు మహిళలు, వృద్ధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

ర్యాలీలో పిఠాపురం ఎమ్మెల్యే వస్తున్నాడు అదిగో అంటూ అప్పుడే పవన్ కళ్యాణ్ ని పిఠాపురం ఎమ్మెల్యే ని చేసేసారు అక్కడే ప్రజలు. అడుగడుగునా మహిళలు పవన్ కళ్యాణ్ కి హారతులు ఇచ్చారు. ర్యాలీ సమయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనసేన శ్రేణులు మంచినీళ్లతో పాటు ఆహారం కూడా అందించడం విశేషం. పెద్ద సంఖ్యలో వచ్చిన కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులతో రోడ్లు మొత్తం నిండిపోయాయి.

చాలామంది రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొనటానికి ప్రజలకు మందుని డబ్బుల్ని వెదజల్లుతున్నాయి కానీ మన పవన్ కళ్యాణ్ జన సమీకరణ కోసం పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఆయన మీద అభిమానంతో స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు తన నామినేషన్ ర్యాలీలో పాల్గొనటానికి ఒక్కొక్క మనిషికి 150 నుంచి 500 వరకు డబ్బులు చెల్లించి జనాన్ని సమీకరించే ఏర్పాటు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వంగా గీత.

అయినా కూడా ఆ కార్యక్రమంలో జనం చాలా పల్చగా ఉన్నారు. తెదేపా అధినేత చంద్రబాబుని కుప్పంలోనూ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలోనూ ఓడిస్తామంటూ వైసీపీ నాయకులు ప్రగల్బాలు పలుకుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలోనే వాస్తవిక పరిస్థితులు ఏమిటో కూటమి జనాల్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో వైసిపి బ్యాచ్ కి అర్థమయ్యే రీతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు. ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్ తోనే పవన్ కళ్యాణ్ వైసీపీని భయపెట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -